AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Tips: నార్మల్‌ పెట్రోల్‌.. పవర్‌ పెట్రోల్‌.. ఇందులో ఏదీ మంచిది.. రెండింటిలో తేడా ఏంటి?

Auto Tips: ఈ పెట్రోల్ ఎక్కువగా సాధారణ వాహనాల కోసం రూపొదించారు.ఇంజిన్‌ను చల్లగా ఉంచడానికి అధిక ఇంజిన్ ప్రెజర్ అవసరం లేదు. అందువల్ల, దీనికి తక్కువ ఆక్టేన్ రేటింగ్ ఉంది. ఇది సాధారణ ప్రయాణీకుల మోటార్‌సైకిళ్లు, కార్లకు మంచిది. తగినంత ఇంజిన్..

Auto Tips: నార్మల్‌ పెట్రోల్‌.. పవర్‌ పెట్రోల్‌.. ఇందులో ఏదీ మంచిది.. రెండింటిలో తేడా ఏంటి?
Subhash Goud
|

Updated on: Oct 31, 2025 | 1:33 PM

Share

Auto Tips: మీరు కారు లేదా బైక్ కలిగి ఉంటే మీరు సాధారణ ఇంధనం.. పవర్‌ ఇంధన్‌ అని విని ఉంటారు. తరచుగా మీరు మీ వాహనానికి పెట్రోల్ నింపడానికి పెట్రోల్ పంప్‌కు వెళ్ళినప్పుడు మీకు రెండు ఎంపికలు ఉంటాయి. సాధారణ పెట్రోల్, పవర్‌ పెట్రోల్ రెండు ఉంటాయి. దీనిని “ప్రీమియం” లేదా “హై-ఆక్టేన్” పెట్రోల్ అని కూడా పిలుస్తారు. రెండింటి మధ్య ధర వ్యత్యాసం ఉంది. ప్రజలు తమ వాహనానికి ఏ పెట్రోల్ ఉత్తమమో అనే దాని గురించి గందరగోళానికి గురవుతారు. మీ వాహనంలో ఏ పెట్రోల్ నింపాలో నిర్ణయించుకోవడంలో మీరు ఇబ్బంది పడుతుంటే ఈ విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. రెండు రకాల పెట్రోల్‌ల మధ్య తేడాలు, మీ కారు లేదా బైక్‌కు ఏది ఉత్తమమో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: EPFO Pension Rule: మీరు పదేళ్ల తర్వాత ఒక కంపెనీని వదిలివేస్తే పెన్షన్ వస్తుందా? నియమాలు ఏంటి?

సాధారణ పెట్రోల్, పవర్ పెట్రోల్ మధ్య తేడా ఏమిటి?

ఇవి కూడా చదవండి

రెగ్యులర్, పవర్ పెట్రోల్ రెండూ వాహనాలు నడపడానికి ఉపయోగపడతాయి. కానీ రెండు రకాల పెట్రోల్ మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి ఆక్టేన్ రేటింగ్. రెగ్యులర్ పెట్రోల్ తక్కువ ఆక్టేన్ రేటింగ్ కలిగి ఉంటుంది. పవర్ పెట్రోల్ ఎక్కువ. రెగ్యులర్ పెట్రోల్ చౌకగా ఉంటుంది, కానీ పవర్ పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుంది. అయితే దీని అర్థం రెగ్యులర్ పెట్రోల్ మంచిది కాదని లేదా మీరు దానిని ఉపయోగించకూడదని కాదు.

సాధారణ పెట్రోల్:

ఈ పెట్రోల్ ఎక్కువగా సాధారణ వాహనాల కోసం రూపొదించారు.ఇంజిన్‌ను చల్లగా ఉంచడానికి అధిక ఇంజిన్ ప్రెజర్ అవసరం లేదు. అందువల్ల, దీనికి తక్కువ ఆక్టేన్ రేటింగ్ ఉంది. ఇది సాధారణ ప్రయాణీకుల మోటార్‌సైకిళ్లు, కార్లకు మంచిది. తగినంత ఇంజిన్ శక్తిని అందిస్తుంది. ఇది కొంచెం చౌకగా ఉంటుంది. రోజువారీ ఉపయోగం కోసం అనుకూలంగా ఉంటుంది.

పవర్ పెట్రోల్:

పేరుకు తగ్గట్లుగానే ఇది అధిక-పనితీరు గల కార్లు, మోటార్ సైకిళ్ల కోసం రూపొందించారు. అధిక-పనితీరు గల గ్యాసోలిన్ ఇంధనం. ఇది ఇంజిన్ నాకింగ్‌ను తగ్గిస్తుంది. అలాగే సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇంజిన్ భాగాలను శుభ్రంగా ఉంచడంలో, ఇంజిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే ప్రత్యేక సంకలనాలు ఇందులో ఉన్నాయి.

మీ కారుకు ఏ పెట్రోల్ సరిపోతుంది?

మీకు సాధారణ కారు లేదా ప్యాసింజర్ మోటార్ సైకిల్ ఉంటే మీరు సాధారణ పెట్రోల్‌ను ఉపయోగించవచ్చు. వాటి ఇంజిన్‌లకు అధిక ఆక్టేన్ ఇంధనం అవసరం లేదు. ఇది రోజువారీ ఉపయోగం కోసం ఖచ్చితంగా సరిపోతుంది. ఈ వాహనాలను పవర్ పెట్రోల్‌తో నింపడం వల్ల వాటి పనితీరు గణనీయంగా మెరుగుపడదు. మరోవైపు, పవర్ పెట్రోల్ ఖరీదైన స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ SUVలు, టర్బోచార్జ్డ్ ఇంజిన్‌లతో కూడిన వాహనాలకు అనుకూలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Business Idea: కోటీశ్వరులు కావాలనుకుంటే ఈ మొక్కలను నాటండి.. ఎకరాకు కోటి రూపాయలు!

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎకరాకు రూ.10 వేలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి