Nokia Employees: కరోనా మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు తమ తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం అవకాశం ఇచ్చేసింది. ఇక కరోనా కాలంలో ఉద్యోగుల భద్రత కోసం టెలికాం కంపెనీ నోకియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఉద్యోగులు తమ సౌలభ్యం మేరకు అవసరమైతే వారానికి మూడు రోజులు ఇంటి నుంచే పని చేయవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఉన్న వర్క్ ఫ్రం హోం పాలసీ ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో కంపెనీ ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది.
130 దేశాలకు విస్తరించిన నోకియాలో మొత్తం 92 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఖర్చులు తగ్గించుకోవడంతో పాటూ పరిశోధనపై దృష్టి పెట్టేందుకు వచ్చే రెండేళ్లలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నోకియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు సమావేశాలు, టీం వర్క్‌కు ప్రాధాన్యవిచ్చేలా సంస్థ తన కార్యాలయాలను రీడిజైన్ చేస్తోంది. కరోనా కాలంలో చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రం చేసేలా వెసులుబాటు కల్పించింది. ఉద్యోగుల భద్రత పరంగానే కాకుండా ఖర్చులు కూడా తగ్గుతుండటంతో దాదాపు చాలా సంస్థలు కూడా ఇదే బాట పట్టాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని ప్రైవేటు కంపెనీలు కార్యాలయాల నుంచి పనులు చేసేలా చర్యలు చేపడుతున్నాయి.