PAN Card: పాన్‌కార్డ్ పోగొట్టుకున్నారా..! అయితే చింతించనవసరం లేదు.. సింపుల్‌గా ఇలా చేయండి..

|

Aug 15, 2021 | 7:38 PM

PAN Card: బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు అందించే ఆర్ధిక సేవలను

PAN Card: పాన్‌కార్డ్ పోగొట్టుకున్నారా..! అయితే చింతించనవసరం లేదు.. సింపుల్‌గా ఇలా చేయండి..
Pan Card
Follow us on

PAN Card: బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు అందించే ఆర్ధిక సేవలను పొందాలంటే డాక్యుమెంట్స్‌తో పాటు పాన్‌కార్డ్ కూడా అవసరం. అయితే పాన్‌కార్డ్ ఎక్కడైనా పోగొట్టుకుంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డును జారీ చేసే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) అధికారిక వెబ్‌సైట్ నుంచి కొత్తదాని కోసం మీరు అభ్యర్థించవచ్చు. అయితే మొత్తం ప్రక్రియకు కొన్ని రోజులు పట్టవచ్చు. అప్పుడు అత్యవసరంగా మీకు పాన్‌కార్డ్‌ అవసరం ఉంటే మీరు ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ లేదా ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో మనం అన్ని ఆర్థిక లావాదేవీలను చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

1. ఆన్‌లైన్‌లో ఈ -పాన్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి మీరు యుటిఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITSL) అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి https://www.utiitsl.com/2. ‘పాన్ కార్డ్ సేవలు’ ఎంపికను ఎంచుకోవాలి
3. ‘డౌన్‌లోడ్ ఇ-పాన్’ ఎంపికకు వెళ్లాలి
4. మీ పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి
5. మీ పుట్టిన తేదీ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి. మీరు మీ GSTIN నంబర్‌ని కూడా నమోదు చేయాలి
6. క్యాప్చా వివరాలను సమర్పించడం ద్వారా మీ వివరాలను ధృవీకరించాలి
7. ఇప్పుడు మీరు మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్‌ తెలుసుకుంటారు.
8. మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను ధృవీకరించడానికి OTP ని నమోదు చేయాలి

OTP నమోదు చేసిన తర్వాత ఈ -పాన్ కోసం మీ డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఈ విధంగా మీరు కొన్ని నిమిషాల్లో ఈ -పాన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అందించే వివిధ ఆర్థిక సేవల కోసం ఉపయోగించవచ్చు.

Evaru Meelo Koteeswarulu: రామారావు గారు వస్తున్నారు.. మొదట రామ్ చరణ్‌‌ను తెస్తున్నారు.. అదిరిన కర్టెన్ రైజర్

ఝార్ఖండ్ జడ్జి మృతి కేసు.. నిందితుల ఆచూకీ చెబితే రూ. 5 లక్షల రివార్డు.. సీబీఐ: Jharkhand Judge Death Case.ase

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని రాజీనామా చేస్తారా ? మాజీ ఆఫ్ఘన్ హోం మంత్రికి అధికారం అప్పగింత ..?