
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఫిక్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకంగా అనేక సేవింగ్స్ స్కీమ్‌ను నిర్వహిస్తోంది. పిల్లల కోసం, వృద్దుల కోసం, ఉద్యోగుల కోసం ప్రత్యేక పొదుపు పథకాలను నడుపుతోంది. వీటికి సంబంధించిన వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ది యోజన(SSY), నేషనల్ సేవింగ్స్ స్కీమ్ సర్టిఫికేట్(NSC) వంటి పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. పూర్తి వివరాలు చూద్దాం.
పీపీఎఫ్, ఎస్‌ఎస్‌వై, ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇలా మార్పులు చేయపోవడం వరుసగా ఎనిమిదో సారి. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ వరకు అమలవుతాయని తెలిపింది. ప్రతీ త్రైమాసికానికి కేంద్రం వడ్డీ రేట్లను ప్రకటిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2026 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఉన్న నాలుగో త్రైమాసికానికి ప్రకటించిన వడ్డీ రేట్లనే ఇప్పుడు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎస్‌ఎస్‌వో స్కీమ్‌కు 8.2 శాతం వడ్డీ అమలు చేస్తున్నారు. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.1 శాతం ఉంది. ఇక పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం ఉండగా.. పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్లకు 4 శాతంగా ఉంది. ఇక కిసాన్ వికాస్ పుత్ర స్కీమ్‌కు 7.5 శాతంగా ఉండగా.. నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌కు 7.7 శాతం ఉంది. ఇక పోస్టల్ శాఖలో నెలవారీ ఆదాయ పథకంపై 7.4 శాతంగా ఉంది. చివరిసారిగా 2023-24 నాలుగో త్రైమాసికంలో వడ్డీ రేట్లను సవరించారు. ఆ తర్వాత ఇక ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా దేశంలో లక్షలాది మంది ప్రజలు ఈ స్కీమ్‌లలో తమ పెట్టుబడులు పెడుతూ డబ్బులు పొదుపు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడించే పథకాలు కావడంతో భద్రత ఉంటుందనే ఉద్దేశంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా వీటిల్లో తక్కువ మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ముంది. మినిమం ఏడాదికి రూ.500 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాకుండా బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దీంతో దేశంలో లక్షలాది మంది ప్రజలు ఈ చిన్న మొత్తాల సేవింగ్స్ స్కీమ్స్‌లలో పెట్టుబడి పెట్టారు.