WTFund: మీ దగ్గర మంచి బిజినెస్‌ ఐడియా ఉందా? అయితే మీ స్టార్టప్‌కు వీళ్లు పెట్టుబడి పెడతారు..!

Nikhil Kamath WTFund: చాలామంది యువతకు వ్యాపారం చేయాలనే కోరిక ఉన్నా సరైన పెట్టుబడి, మార్గదర్శకత్వం లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ 'WTFund' (ది ఫౌండరీ) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

WTFund: మీ దగ్గర మంచి బిజినెస్‌ ఐడియా ఉందా? అయితే మీ స్టార్టప్‌కు వీళ్లు పెట్టుబడి పెడతారు..!
Nikhil Kamath Wtfund

Updated on: Jan 23, 2026 | 8:41 PM

సాధారణంగా చాలా మందికి బిజినెస్‌ చేయాలనే ఆలోచన ఉంటుంది. వాళ్ల డ్రీమ్స్‌ పెద్దవిగా ఉన్నా.. సరైన పెట్టుబడి, గైడెన్స్‌ లేక తమ బిజినెస్‌ ఐడియాను ముందుకు తీసుకెళ్లలేరు. కానీ ఎప్పటికైనా తమ కలల బిజినెస్‌ చేయాలనే తపనతో ఉంటారు. అలాంటి వారి కోసం జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అద్భుతమైన ఐడియాతో ముందుకు వచ్చారు. బిజినెస్‌ చేయాలనే కసి ఉండి, మంచి స్టార్టప్‌ ఐడియా కలిగి ఉన్న యంగ్‌ జనరేషన్‌ను ఎంకరేజ్‌ చేయడమే కాకుండా వారి బిజినెస్‌కు అవసరమైన పెట్టుబడి కూడా ఇచ్చేందుకు ఒక ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ చేశారు.

యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడంలో సహాయపడే “ది ఫౌండరీ” లేదా “డబ్ల్యుటిఫండ్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2035 వరకు ఇండియా ఒక హై ఇన్‌మక్‌ కంట్రీగా మారిపోనుంది. సో.. మన దేశంలో పలు రకాల బిజినెస్‌లకు మంచి డిమాండ్‌ ఏర్పడనుంది. అందుకే నిఖిల్‌ కామత్‌ ఈ ఐడియాతో ముందుకు వచ్చారు. జస్ట్‌ మీ స్టార్టప్‌ ఐడియాను పంచుకుంటూ ఫండింగ్‌ కోసం అప్లైయ్‌ చేసుకుంటే చాలు.. మీ ఐడియా స్టార్ట్‌ లిస్ట్‌ అయితే బిజినెస్‌కి కావాల్సిన సపోర్ట​్‌, మెంటర్‌షిప్‌, గైడెన్స్‌తో పాటు పెట్టుబడి కూడా వాళ్లే ఇస్తారు.

కో-ఫౌండర్ ఫ్యాక్టరీ అనే 90 రోజుల రెసిడెన్షియల్ స్టార్టప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎంపిక చేయబడిన స్టార్టప్‌లు రూ.4 కోట్ల వరకు సీడ్ ఫండింగ్, అనుభవజ్ఞులైన మెంటర్ల (విజయ్ శేఖర్ శర్మ, కునాల్ బహల్ వంటివారు) నుండి మార్గదర్శకత్వం పొందుతాయి. ప్రతిగా వ్యవస్థాపకులు కంపెనీలో 25 శాతం వరకు వాటాను పొందవచ్చు. ఇది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువ వ్యవస్థాపకులకు మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది భారతదేశంలో మొట్టమొదటి నాన్-ఈక్విటీ గ్రాంట్ ఫండ్, అంటే ఇది ఎటువంటి వాటా తీసుకోకుండా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

జనవరి 2026 నాటికి ఈ వేదిక యువతకు అనేక దశల్లో మార్గదర్శకత్వం, వనరులను అందించింది. జనవరి 2026లో ‘స్టార్టప్ ఇండియా’ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలో స్టార్టప్‌ను సృష్టించడానికి ఈరోజు ఉత్తమ సమయం అని, యువతలో వ్యవస్థాపకత ఇప్పుడు చక్కని కెరీర్ ఎంపికగా మారిందని నిఖిల్ కామత్ అన్నారు. అయితే ఈ స్కీమ్‌లో ఫండింగ్‌ కోసం అప్లై చేసుకునేందుకు, అలాగే పూర్తి వివరాల కోసం www.allthingswtf.com/wtfund వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి