LPG Cylinder: కేంద్ర ప్రభుత్వం నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్.. గ్యాస్‌ సిలిండర్ ధర తగ్గింపు?

నూతన సంవత్సరం 2026 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త అందించింది. జనవరి 1 నుండి CNG, PNG ధరలు తగ్గనున్నాయి. నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఇది ఊరట కలిగించనుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

LPG Cylinder: కేంద్ర ప్రభుత్వం నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్.. గ్యాస్‌ సిలిండర్ ధర తగ్గింపు?
Gas Price

Updated on: Dec 19, 2025 | 6:30 AM

నూతన సంవత్సరం 2026 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పనుంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. జనవరి 1 నుండి దేశంలో సీఎన్జీ (CNG), పీఎన్జీ (PNG) ధరలు యూనిట్‌కు రూ.2 నుండి రూ.3 వరకు తగ్గనున్నాయి. ఈ నిర్ణయం వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఇళ్లలో పైపుల ద్వారా గ్యాస్ వాడే వారికి ప్రయోజనం కలుగుతుంది.

కేవలం వాటిపైనే కాకుండా వంట గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో కూడా శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. ఈ ఏడాది కమర్షియల్‌ సిలిండర్ల ధరలు పలుమార్లు తగ్గినప్పటికీ, డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరల్లో మార్పులు రాలేదు. 2024 మార్చి 9 నుండి డొమెస్టిక్‌ సిలిండర్ ధర అలాగే ఉంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ లేని గృహ సిలిండర్ ధర రూ.803లుగా ఉంది. కోల్‌కతాలో రూ.829, ముంబై నగరంలో రూ.802.50, చెన్నైలో రూ.818.50లుగా ఉన్నాయి.

వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నుల కారణంగా ఈ ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో రూ.900కు పైగానే ఉంది. నూతన ఏడాది సందర్భంగా వచ్చే నెల జనవరి కోసం చమురు కంపెనీలు ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగే సామాన్యులకు భారీ ఊరట లభించినట్లే.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి