EPFO Update Rules: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు అలర్ట్.. అప్డేట్ రూల్స్ అన్నీ ఛేంజ్.. కొత్త మార్పులు ఇవే..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు భారీ శుభవార్త. ఇక నుంచి మీ పీఎఫ్ అకౌంట్లోని వివరాలను ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. కొన్ని వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం ఉండదు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ విరరాలు ఇలా..

EPFO Update Rules: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు అలర్ట్.. అప్డేట్ రూల్స్ అన్నీ ఛేంజ్.. కొత్త మార్పులు ఇవే..
Epfo Update

Updated on: Jan 11, 2026 | 6:37 PM

ఉద్యోగుల భవిష్య నిధి పథకం(ఈపీఎఫ్‌వో) ఎప్పుడూ ఏవోక రూల్స్ మారుస్తూ ఉంటుంది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా ఎప్పటికప్పుడు నిబంధనల్లో మార్పులు తెస్తూ ఉంటుంది. మరింత సులభతరం, పాదర్శకతతో సేవలు అందించేందుకు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలు అప్డేట్‌కు సంబంధించి పలు మార్పులు చేస్తోంది. పేరు, లింగం, తండ్రి పేరు, పుట్టిన తేదీ, నేషనాలిటీ వంటి వివరాలు మార్చుకునే ప్రక్రియను మిరింత ఈజీ చేసింది. వీటిని మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి పత్రాలు సమర్పించాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

వీటిని అప్డేట్ చేసుకోవచ్చు

పేరు, తండ్రి లేదా తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ వివరాలు, నేషనాలిటీ, ఉద్యోగంలో చేరిన తేదీ, ఎగ్జిట్ అయిన తేదీ వివరాలను ఉద్యోగులు మార్చుకోవచ్చని ఈపీఎఫ్‌వో తాజాగా ఓ సర్క్యూలర్ జారీ చేసింది. వీటిని ఖాతాదారులు ఆన్‌లైన్‌లో అవసరమైన ధృవీకరణ పత్రాలు అందించి మార్చుకోవచ్చని స్పష్టం చేసింది.

నేషనాలిటీ మార్చుకోవడం ఎలా..?

ఇక నుంచి ఈపీఎఫ్‌వో అకౌంట్లో నేషనాలిటీ తప్పుగా ఎంటర్ అయినా సులువుగా మార్చుకోవచ్చు. మీ యూఏఎన్ నెంబర్ అక్టోబర్ 1,2017 కంటే ముందే యాక్టివేట్ చేసి ఉండాలి. అలాగే ఈపీఎఫ్ అకౌంట్లో మీ ఆధార్ వివరాలు వెరిఫికేషన్ పూర్తయి ఉండాలి. ఈ రెండు పనులు చేసి ఉంటే మీరు జాతీయత, పేరు, తల్లిదండ్రుల పేర్లను సులువుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అప్డేట్ చేశాక యాజమాన్యం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక మీ ప్రొఫైల్‌లో జాతీయ కాలం ఖాళీగా ఉంటే వెంటనే సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత భారత పౌరసత్వం నుంచి అంతర్జాతీయ పారసత్వం పొందినప్పుడు మాత్రమే నేషనాలిటీ మార్చుకోవడానికి వీలవుతుంది.

అప్డేట్ చేసుకోకపోతే..

మీ ఈపీఎఫ్‌వో ప్రొఫైల్‌లో వివరాలు తప్పుగా నమోదు అయి ఉంటే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు క్లెయిమ్ చేసుకునే సమయంలో సమస్యలు ఎదురవుతాయి. వివరాలు తప్పుగా ఉంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.  అలాగే పెన్షన్ పెందాలనుకున్నప్పుడు కూడా సమస్యలు వచ్చే అవకాశముంది. అందువల్ల ఎప్పుటికప్పుడు మీరు పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి వివరాలను చెక్ చేసుకుంటూ ఉండాలి. తప్పుగా ఉంటే మార్చుకోవడానికి వెంటనే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మీ యాజమాన్యం మీ వివరాలను ధృవీకరిస్తే సరిపోతుంది. ఇక బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను బ్యాంక్ ధృవీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు వివరాలను అప్డేట్ చేసుకునే ప్రక్రియ మరింత సులభతరం అయిందని చెప్పవచ్చు.