New TDS Rules: TDS కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను శాఖ.. జులై 1 నుంచి అమలు..

|

Jun 20, 2022 | 11:40 AM

ఆదాయ పన్ను శాఖ TDSకు సంబంధి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. వ్యాపారం లేదా వృత్తిలో ప్రయోజనాలను పొందడానికి సంబంధించిన టీడీఎస్ మార్గదర్శకాలనుప్రత్యక్ష పన్నుల శాఖ నోటిఫై చేసింది...

New TDS Rules: TDS కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను శాఖ.. జులై 1 నుంచి అమలు..
Tax
Follow us on

ఆదాయపు పన్ను శాఖ TDSకు సంబంధి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. వ్యాపారం లేదా వృత్తిలో ప్రయోజనాలను పొందడానికి సంబంధించిన టీడీఎస్ మార్గదర్శకాలనుప్రత్యక్ష పన్నుల శాఖ నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫైనాన్స్ యాక్ట్ 2022 ప్రకారం ఆదాయ పన్ను చట్టం, 1961లో కొత్త సెక్షన్ 194R కొత్తగా యాడ్‌ చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం, ఒక కంపెనీ మార్కెటింగ్ ప్రయత్నాలలో భాగంగా వారి కోసం ఇచ్చిన పరికరాలను వ్యక్తి వద్ద ఉంచుకుంటే TDS మొత్తాన్ని చెల్లించడం తప్పనిసరి. అయితే ఆ పరికరాలను కంపెనీకి తిరిగి ఇస్తే టీడీఎస్ వర్తించదని సీబీడీటీ స్పష్టం చేసింది. కారు, మొబైల్, దుస్తులు, సౌందర్య సాధనాలు ఉపయోగించిన తర్వాత ఉత్పత్తిని ఉత్పాదక సంస్థకు తిరిగి పంపినట్లయితే, అది ప్రయోజనం లేదా పర్క్విజిట్‌గా పరిగణించరు.

రెసిడెంట్‌కు ఏదైనా బెనిఫిట్ అందించడానికి బాధ్యత వహించే వ్యక్తి, దాన్ని అందించే ముందు, బెనిఫిట్ విలువలో 10 శాతం టీడీఎస్ మినహాయించాలని CBDT స్పష్టం చేసింది. జూన్ 16 గురువారం నాడు జారీ చేసిన నోటీసులో ఈ వివరాలు పేర్కొంది. ఫైనాన్స్ యాక్ట్ 2022లోని సెక్షన్ 28 క్లాజ్ (iv) ప్రకారం.. గ్రహీత వద్ద బెనిఫిట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుందా లేదా అనేది పన్ను చెల్లింపుదారులు తనిఖీ చేయాల్సిన అవసరం లేదని CBDT తెలిపింది. అంతేకాకుండా, సేల్స్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, కస్టమర్లకు అనుమతించే రాయితీలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఆర్ కింద ఎలాంటి పన్ను మినహాయించాల్సిన అవసరం లేదని CBDT స్పష్టం చేసింది. TDS వర్తించే సందర్భాలలో నగదు లేదా కారు, టెలివిజన్, కంప్యూటర్లు, బంగారు నాణెం, మొబైల్ ఫోన్, విదేశీ పర్యటనలు, అమ్మకాలను ప్రోత్సహించడానికి ఇచ్చే ఈవెంట్‌ల కోసం ఉచిత టిక్కెట్‌లు వంటి వస్తువులు ఉంటాయి.