AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Rules: దేశ ప్రజలకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కొత్త మార్పులు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ట్యాక్స్ మినహాయింపులకు సంబంధించి నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచి అముల కానున్నాయి. బడ్జెట్‌లో పలు ట్యాక్స్ తగ్గింపులు కేంద్రం ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ట్యాక్స్ రూల్స్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరముంది.

Income Tax Rules: దేశ ప్రజలకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కొత్త మార్పులు ఇవే..
Money
Venkatrao Lella
|

Updated on: Feb 06, 2026 | 12:58 PM

Share

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో పలు ట్యాక్స్ మినహాయింపులు ప్రకటించింది. ఈ బడ్జెట్‌లో సామాన్యులకు ఊరటనిచ్చేలా అంతగా ప్రకటనలు ఏమీ లేవు. కానీ పలు వస్తువులపై ట్యాక్స్ తగ్గింపులతో పాటు విదేశాలకు పంపే నగదు, టూర్ ప్యాకేజీలపై కేంద్రం మినహాయింపులు ఇచ్చింది. అలాగే మరికొన్నింటిపై ట్యాక్స్‌లను తగ్గించింది. ఈ నిర్ణయాలు అన్ని కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభం కానున్న ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ట్యాక్స్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఊరట

ఇక కేంద్ర బడ్జెట్ 2026-27లో విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఊరట కల్పించారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గితంచారు. దీంతో ట్రావెల్ ఏజెన్సీలు అందించే టూర్ ప్యాకేజీల ద్వారా విదేశీ ప్రయాణాలు చేసేవారికి ట్యాక్సులు తగ్గుతాయి. దీని వల్ల విదేశీ ప్రయాణాల ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ తగ్గింపుతో టూర్ ప్యాకేజీలు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమలు కానుంది.

విదేశాలకు డబ్బులు పంపితే..

ఇక భారతదేశంలో ఉన్నవారు ఖర్చుల నిమిత్తం విదేశాల్లో ఉన్నవారికి డబ్బులు పంపిస్తూ ఉంటారు. విదేశాల్లో చదుకునే తమ పిల్లల కోసం డబ్బులు పంపించడం లేదా వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు పంపించడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేసేవారికి ఏప్రిల్ నుంచి టీసీఎస్ తగ్గనుంది. విద్య, వైద్య ఖర్చుల కోసం లిబరలైడ్జ్ రెమిటెన్స్ స్కీమ్ కింద డబ్బులు పంపేవారికి టీసీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తూ బడ్జెట్‌లో ప్రకటన చేవారు. రూ.10 లక్షల వరకు పంపే డబ్బులపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇక ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు మంచి డబ్బులు పంపితే 20 శాతం టీసీఎస్ ఉంటుంది.

ఆ వడ్డీపై ట్యాక్స్ లేదు

ఇక రోడ్డు ప్రమాదాల సమయంలో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఇచ్చే నష్టపరిహారంపై వచ్చే ఆదాయంకు సంబంధించి వడ్డీపై ఎలాంటి ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. రోడ్డు ప్రమాద బాధితులు లేదా కుటుంబసభ్యులకు ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 1వ తేదీన నుంచి ఇది అమల్లోకి రానుంది.

పెనాల్టీపై వడ్డీ తొలగింపు

ఇక టాక్స్ పెనాల్టీపై అప్పీల్ చేనినప్పుడు ఆ పెనాల్టీపై వడ్డీ ఉండదు. అప్పీల్ ఫలితం ఎలా ఉన్నా వడ్డీ ఉండదు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. అటు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మార్చి 31వ తేదీ వరకు గుడవు పొడిగించారు. ఫైల్ చేసిన దానిలో ఏమైనా తప్పులు ఉన్నా సవరించుకోవచ్చు.

Follow Us
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది