New Income Tax Bill: ఐటీ రిటర్న్ ఆలస్యమైతే రీఫండ్ రాదా..? ఐటీ శాఖ ఏం చెప్తోంది..

ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్ణీత వ్యవధిని తెలియజేస్తుంది. ఈ ఏడాది కొత్త పన్ను బిల్లు చర్చల్లో ఉండటంతో చెల్లింపుదారుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి. రిటర్న్ లు దాఖలు చేయడం ఆలస్యమైతే రిఫండ్ చెల్లింపులు ఉండవా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Income Tax Bill: ఐటీ రిటర్న్ ఆలస్యమైతే రీఫండ్ రాదా..? ఐటీ శాఖ ఏం చెప్తోంది..
Itr Returns

Updated on: Feb 18, 2025 | 9:04 PM

కొత్త పన్ను బిల్లు కింద ఆలస్యంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల రిఫండ్ రాదనే చర్చ జోరుగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. చెల్లింపుదారులు ఏదైనా కారణంచేత పన్ను చెల్లించడం ఆలస్యమైతే రిఫండ్‌ను నష్టపోవలసి వస్తుంది కదా అని ఈ నిబంధనపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై ఎక్స్ వేదికగా ఆదాయపు పన్ను అధికారులు స్పందించారు. గడువు తేదీకు ముందు ఐటీ రిటర్న్ లు దాఖలు చేయనివారు రీఫండ్ చెల్లింపులకు అర్హులు కారనే వార్త చాలా మందిలో ఆందోళనకు కారణమవుతోంది. అయితే, కొత్తగా వచ్చిన పన్ను బిల్లు ప్రకారం అలాంటి మార్పులేమీ చేయలేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది.

ఐటీ శాఖ ఏం చెప్పిందంటే..

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు జులై 31లోగా ఐటీ రిటర్నులు దాఖలు చేయవలసి ఉంటుంది. ఏదైనా కారణంతో ఆలస్యమైతే డిసెంబర్ 31 వరకు రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే, ఇవేవీ చెల్లింపుదారులు రిఫండ్ ను పొందే విషయంలో అడ్డంకులు కావని అధికారులు తెలిపారు. నూతన ఐటీ బిల్లులో రిఫండ్లలో ఎటువంటి నిబంధనలనూ మార్చలేదని చెప్పింది. ఆలస్యంగా ఐటీఆర్‌ దాఖలు చేసినప్పటికీ రిఫండ్‌ పొందవచ్చని క్లారిటీ ఇచ్చింది. కాగా, నూత ఐటీ బిల్లుకు ఆమోద ముద్ర పడితే 2026-27 ఆర్థిక ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది.

కొత్త చట్టం ప్రకారం..

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, క్లాజ్ 263(1)(a)(ix) ప్రకారం.. చెల్లింపు దారులు నిర్దేశిత గడువువలోగా రిటర్న్ లు ఫైల్ చేస్తేనే వారా తిరిగి రిఫండ్ ను క్లెయిమ్ చేయగలరని చట్టం చెప్తోంది. కానీ, ప్రస్తుత ఆదాయపు చట్టంలో ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసిన వారు కూడా రిఫండ్ ను పొందవచ్చని గుర్తు చేస్తున్నారు.