Honda City Car: మార్కెట్‌లోకి హోండా సిటీ 2023 ఎడిషన్లు.. హ్యూందాయ్ వెర్నాకు గట్టి పోటీనే..

|

Mar 04, 2023 | 4:30 PM

. హోండా సిటీ కార్లల్లో 2023 ఎడిషన్లు వినియోగదారులను పలుకరిస్తున్నాయి. హోండా సిటీ 2023ను కేవలం రూ.11.49 లక్షల ప్రారంభ ధరకు కంపెనీ రిలీజ్ చేసింది. అయితే ఈ కార్‌లో టాప్ వేరియంట్ ధర మాత్రం రూ.20.39 లక్షల వరకూ ఉంది.

Honda City Car: మార్కెట్‌లోకి హోండా సిటీ 2023 ఎడిషన్లు.. హ్యూందాయ్ వెర్నాకు గట్టి పోటీనే..
Honda City
Follow us on

భారతదేశంలో కార్ల కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడే హోండా సిటీ కార్లల్లో సరికొత్త ఎడిషన్లు లాంచ్ అయ్యాయి. హోండా సిటీ కార్లల్లో 2023 ఎడిషన్లు వినియోగదారులను పలుకరిస్తున్నాయి. హోండా సిటీ 2023ను కేవలం రూ.11.49 లక్షల ప్రారంభ ధరకు కంపెనీ రిలీజ్ చేసింది. అయితే ఈ కార్‌లో టాప్ వేరియంట్ ధర మాత్రం రూ.20.39 లక్షల వరకూ ఉంది. అలాగే బ్రాండ్ సిటీ కార్లు రూ.11.49 లక్షల నుంచి రూ.15.97 లక్షలుగా ఉంది. సిటీ ఈ వెర్షన్‌లో హెచ్ఈవీ హైబ్రిడ్ వెర్షన్ అయితే రూ.18.89 లక్షల నుంచి రూ.20.39 లక్షలుగా ఉంది. అయితే ఇందులో డిజీల్ వెర్షన్లు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హోండా సిటీ 2023లో హ్యుందాయ్ వెర్నాకు గట్టి పోటిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో పాటు యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్లు కచ్చితం వినియోగదారులను ఆకట్టుకుంటాయని హోండా మోటర్స్ ప్రతినిధులు చెబుతున్నారు. హోండా సిటీలో వచ్చే అధునాతన ఫీచర్లేంటో? ఓ సారి తెలుసుకుందాం.

హోండా సిటీ ఫీచర్లు ఇవే

డైమండ్ చెకర్ట్ ఫ్లాగ్ ప్యాటర్న్‌తో సరికొత్త గ్రిల్‌తో పాటు లోయర్ మౌల్డింగ్‌తో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ ఈ కార్ ప్రత్యేకతగా ఉంటుంది. కొత్త ఫాగ్ ల్యాంప్ గార్నిష్, కార్బన్ ర్యాప్డ్ డిఫ్యూజర్‌తో కొత్త రియర్ బంపర్‌తో  వస్తుంది. బాడీ-కలర్ బూట్ లిడ్ స్పాయిలర్, సరికొత్త పదహారు అంగుళాల డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సిటీ ఫేస్‌లిఫ్ట్ అబ్సిడియన్ బ్లూ పెర్ల్ రూపంలో సరికొత్త డిజైన్‌తో ఈ కార్ ఆకర్షణీయంగా ఉంటుంది. క్యాబిన్ లోపల పెట్రోల్ వెర్షన్‌లో అయితే డ్యూయల్-టోన్ లేత గోధుమరంగు, నలుపు రంగు. సిటీ ఈ హెచ్ఈవీ హైబ్రిడ్ కోసం డ్యూయల్-టోన్ ఐవరీ, బ్లాక్ ఫినిషింగ్ ఉన్నాయి. హోండా వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లేతో పాటు ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ డోర్ ఇన్నర్ హ్యాండిల్‌తో పాటు ఫ్రంట్ డోర్ పాకెట్స్ కోసం యాంబియంట్ లైటింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సిటీ ఈ హెచ్ఈవీ హైబ్రిడ్‌లో కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ అసిస్టెంట్ సైడ్ గార్నిష్ ఫినిషింగ్, ఏసీ వెంట్‌లపై పియానో ​​బ్లాక్ సరౌండ్ ఫినిషింగ్, స్టీరింగ్ వీల్‌పై పియానో ​​బ్లాక్ గార్నిష్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్ ఈ కార్ ప్రత్యేకతగా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను మెరుగుపరిచినట్లు హోండా ప్రతినిధులు పేర్కొన్నారు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ ఈ కార్ ప్రత్యేకతగా ఉంటుంది. హోండా సిటీ వెనుక ప్రత్యేక కెమెరాతో వస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వీ, వీఎక్స్, జెడ్ఎక్స్‌ వేరియంట్లకు అదనంగా సిటీ పెట్రోల్ కొత్త ఎంట్రీ-లెవల్ ఎస్‌వీ వేరియంట్‌లో వస్తుంది.. సిటీ ఈ హెచ్ఈవీ హైబ్రిడ్ ఇప్పుడు పూర్తిగా లోడ్ చేసిన జెడ్ఎక్స్ వేరియంట్‌తో పాటు కొత్త ఎంట్రీ-లెవల్ వీ వేరియంట్‌‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

2023 హోండా సిటీలో ప్రత్యేకమైన సెన్సింగ్ ఆప్షన్లు ఇవే

  • ఘర్షణ తగ్గించే బ్రేకింగ్ సిస్టమ్ (సీఎంబీఎస్)
  • తక్కువ-స్పీడ్ ఫాలోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (నగరంలో ఈ:హెచ్ఈవీ)
  • రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్
  • లేన్ కీప్ అసిస్ట్ సిస్టమ్
  • లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ 
  • ఆటో హై-బీమ్

హోండా సిటీ 2023 ధరలు ఇలా

  • సిటీ పెట్రోల్ ఎంటీ ఎస్‌వీ  – రూ. 11.49 లక్షలు
  • సిటీ పెట్రోల్ ఎంటీవీ – రూ. 12.37 లక్షలు
  • సిటీ పెట్రోల్ సీవీటీవీ- రూ. 13.62 లక్షలు
  • సిటీ పెట్రోల్ ఎంటీవీఎక్స్  – రూ. 13.49 లక్షలు
  • సిటీ పెట్రోల్ సీవీటీ వీఎక్స్- రూ. 14.74 లక్షలు
  • సిటీ పెట్రోల్ ఎంటీ జెడ్ఎక్స్- రూ. 14.72 లక్షలు
  • సిటీ పెట్రోల్ సీవీటీ జెడ్ఎక్స్ – రూ. 15.97 లక్షలు
  • సిటీ ఈవీహెచ్ఈవీ హైబ్రిడ్ ఈ సీవీటీ వీ- రూ 18.89 లక్షలు
  • సీటీ ఈహెచ్ఈవీ హైబ్రిడ్ ఈసీవీటీ జెడ్ఎక్స్ – రూ. 20.39 లక్షలు

మరిన్ని బిజినెస్ కథనాలు చదవండి..