
మీకు ఒక కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినప్పడు ఆటోమేటిక్‌గా ఆ నంబర్ ఎవరి పేరు మీద ఉందో ఆ పేరు డిస్‌ప్లేపై కనిపించగానే కంగారు పడకండి. భారత ప్రభుత్వం మన సేఫ్టీ కోసమే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది. అందులో భాగంగా కొన్ని సర్కిల్స్‌లో ఈ కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నారు.
తమకొచ్చిన కొత్త నంబర్ ఎవరిదో అని తెలుసుకోవడానికి చాలా మంది ట్రూకాలర్ యాప్ వాడుతుంటారు. అయితే ఆ యాప్‌లో ఎవరైనా ఏ నేమ్ అయినా సేవ్ చేసుకోవచ్చు. వాళ్లు ఎలా సేవ్ చేసుకుంటే అలా వస్తుంది. కానీ, ప్రభుత్వం తీసుకొరానున్న CNAP (కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్) కాలర్ ఆధార్‌తో లింక్ అయిన పేరును చూపిస్తుంది.
ప్రభుత్వం గత నెలలో CNAP పోర్టల్‌ను ఆమోదించింది. టెలికాం ఆపరేటర్లు ఇప్పుడు ఎంపిక చేసిన సర్కిల్‌లలో ఈ సర్వీస్‌ను టెస్ట్ చేస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుందంటే.. సిమ్ కొన్న సమయంలో ఏ ఆధార్ అయితే ఇచ్చి ఉంటారు. అందులో ఉండే పేరు కాల్ వచ్చే ముందు డిస్‌ప్లే అవుతుంది. ఒక వేళ మీ మొబైల్‌లో ఆ నంబర్ సేవ్ అయి ఉన్నా కూడా మొదట ఆధార్‌లో ఉన్న పేరు వచ్చి, ఆ తర్వాత మీరు సేవ్ చేసుకున్న పేరు వస్తుంది.
ఈ ఫీచర్‌ను ముఖ్యంగా స్పామ్, మోసం లేదా వ్యాపార కాల్‌ల విషయంలో థర్డ్-పార్టీ యాప్‌లపై ఆధారపడకుండా తెలియని కాలర్‌లను వినియోగదారులు వెంటనే గుర్తించేందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. టెస్ట్ స్టేజ్‌లో ఉండటం వల్ల కొన్ని సర్కిల్స్‌లోనే అందుబాటులో ఉంచారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
Modi govt is now testing CNAP – a new caller ID system that shows the Aadhaar-linked name of the caller first, even before the name saved in your phone.
This could be a game-changer for stopping fraud pic.twitter.com/yaNaJv0g0g
— Sunny Raj (@SunnyRajBJP) November 22, 2025
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి