New Expressway: ఇప్పుడు 6 గంటల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే..

New Expressway: దేశంలో రహదారులు మరింత మెరుగవుతున్నాయి. ప్రయాణంలో ఎలాంటి అలసట, ఇబ్బంది లేకుండా సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ వేలు అందుబాటులోకి తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం. అతి తక్కువ సమయంలోనే ప్రయాణాన్ని పూర్తి చేసేలా రహదారులను రూపొందిస్తోంది. ఇప్పుడు 6 గంటల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే పూర్తి చేసుకోవచ్చు..

New Expressway: ఇప్పుడు 6 గంటల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే..

Updated on: Jul 23, 2025 | 9:13 PM

ఢిల్లీ నుండి డెహ్రాడూన్ వరకు 210 కి.మీ. పొడవైన కొత్త ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల ముఖచిత్రాన్ని కూడా మారుస్తుంది కేంద్ర ప్రభుత్వం. రూ.13,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే.. భారత్‌మాల ప్రాజెక్టులో ఒక భాగం. ఇది ప్రయాణ సమయాన్ని 6.5 గంటల నుండి కేవలం 2.5 గంటలకు తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్‌ టాటా ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? దీని విలువ ఎన్ని కోట్లు?

ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నాలుగు భాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి దశ ఢిల్లీ నుండి బాగ్‌పత్ వరకు 32 కి.మీ ఎలివేటెడ్ విభాగం. దీనిని ఇప్పుడు కేవలం 25 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. రెండవ దశ బాగ్‌పత్ నుండి సహారన్‌పూర్ వరకు 118 కి.మీ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్. ఇందులో 60 కి పైగా అండర్‌పాస్‌లు, 4 ఇంటర్‌ఛేంజ్‌లు ఉంటాయి. మూడవ దశ సహరన్‌పూర్ బైపాస్ నుండి గణేష్‌పూర్ వరకు 40 కి.మీ ఆరు లేన్ల రహదారి. ఇది పర్యాటకం, నివాస అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. నాల్గవ దశ గణేష్‌పూర్ నుండి డెహ్రాడూన్ వరకు 19.5 కి.మీ. పొడవు. రాజాజీ టైగర్ రిజర్వ్, శివాలిక్ కొండల గుండా వెళుతుంది. దాత్ కాళీ దేవి సొరంగం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Honda: స్టైలిష్‌ లుక్‌తో హోండా నుంచి రెండు పవర్‌ఫుల్‌ బైక్‌లు.. ఫీచర్స్‌ అదుర్స్‌!

ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు డెహ్రాడూన్‌లో మెట్రో ప్రాజెక్ట్ కూడా రెండు దశల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. హరిద్వార్-ఋషికేశ్ (32 కి.మీ), నేపాలీ ఫామ్-డెహ్రాడూన్ (41 కి.మీ) మార్గాల్లో మొత్తం 73 కి.మీ. పొడవైన లైన్ నిర్మిస్తున్నారు. అలాగే జాలీ గ్రాంట్ విమానాశ్రయ విస్తరణ కూడా ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది.

ఢిల్లీ-ఎన్‌సిఆర్ వెలుపల డెహ్రాడూన్, రిషికేశ్, హరిద్వార్‌లు ఇకపై కేవలం మతపరమైన లేదా పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు. రియల్ ఎస్టేట్ కొత్త కేంద్రాలుగా మారుతున్నాయి. మ్యాజిక్‌బ్రిక్స్ నివేదిక ప్రకారం.. ఢిల్లీలో సగటు రేటు చదరపు అడుగుకు రూ.18,618 కాగా, డెహ్రాడూన్‌లో ఇది చదరపు అడుగుకు రూ.5,653. రెండవ ఇళ్లకు డిమాండ్ 43 శాతం పెరిగింది.

ఇది కూడా చదవండి: PAN Card: మీ పాన్‌ కార్డును ఉపయోగించి ఎవరైనా లోన్‌ తీసుకున్నారా? ఇలా తెలుసుకోండి.. సింపుల్‌ ట్రిక్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి