AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: అర్జెంటుగా లోన్ కావాలా? ఈ ఆర్‌‌బీఐ అప్రూవ్డ్ యాప్స్ ట్రై చేయండి!

మీకు అర్జెంట్ గా లోన్ కావాల్సి వచ్చినప్పుడు ఉండేవి రెండే ఆప్షన్స్. ఒకటి ఫ్రెండ్స్ లేదా బంధువలను అడగడం లేదా బ్యాంక్ లో ట్రై చేయడం. అయితే ఈ రెండింటి కంటే ఫాస్ట్ గా లోన్ దొరికే ఆప్షన్ ఉంది. అదే ఇన్ స్టంట్ లోన్ యాప్స్. అయితే వీటిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ బీ ఐ అప్రూవ్ చేసిన యాప్స్ లో మాత్రమే లోన్ తీసుకోవాలి. అలాంటి కొన్ని బెస్ట్ యాప్స్ ఇప్పుడు చూద్దాం.

Personal Loan: అర్జెంటుగా లోన్ కావాలా? ఈ ఆర్‌‌బీఐ అప్రూవ్డ్ యాప్స్ ట్రై చేయండి!
Personal Loan Apps
Nikhil
|

Updated on: Oct 05, 2025 | 1:40 PM

Share

ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ గురించి మనం వింటునే ఉంటాం. అప్లై చేసిన వెంటనే ఫోన్ లోనే  కెవైసీ ప్రాసెస్ జరిగిపోతుంది. మీ ప్రొఫైల్ ఎలిజిబుల్ అయితే నిముషాల్లోనే డబ్బు అకౌంట్ లో పడిపోతుంది. అయితే వీటితో కొన్ని మంచివి కొన్ని ఫేక్ వి ఉన్నాయి. కొన్ని ఫేక్ యాప్స్ అధిక వడ్డి వసూలు చేయడంతో పాటు రీపేమెంట్ కోసం కాల్స్ చేసి వేధిస్తుంటారు. అందుకే లోన్ యాప్స్ ఎంచుకునేముందు అది ఆర్‌‌బీఐ ఆమోదం పొందినదై ఉండేలా చూసుకోవాలి. అలాంటి యాప్స్ లో కొన్ని ఇవీ..

ఆదిత్యా బిర్లా క్యాపిటల్

ఆదిత్యా బిర్లా క్యాపిటల్ అనేది ఆర్‌‌బీఐ అప్రూవ్డ్ ఫైనాన్స్ సంస్థ. ఈ యాప్ ద్వారా సులభంగా లోన్ లభిస్తుంది. – వార్షిక వడ్డీ 10.99 % నుంచి మొదలవుతుంది. ఈఎంఐ12 నెలలకు మించి టెన్యూర్ పెట్టుకుంటే వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంది. సిబిల్ స్కోరు 650కు పైనా ఉంటే ఈజీగా లోన్ అప్రూవ్ అవుతుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ యాప్ ద్వారా కూడా సులభంగా పర్సనల్ లోన్ పొందొచ్చు. ఇందులో 9.99 శాతం వడ్డీ రేటుతో లోన్ లభిస్తుంది. లోన్ రీపేమెంట్ టైం 9 నెలల నుంచి గరిష్టంగా 60 నెలల వరకూ పెట్టుకోవచ్చు. సిబిల్ స్కోరు 650 ఉంటే ఈజీగా లోన్ అప్రూవ్ అవుతుంది.

క్రెడిట్ బీ

క్రెడిట్ బీ కూడా ఆర్‌‌బీఐ అప్రూవ్డ్ లోన్ యాప్స్‌లో ఒకటి.  తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి కూడా ఇందులో ఈజీగా లోన్ లభిస్తుంది. అయితే ఇందులో వడ్డీ రేట్లు ఎక్కువ. వార్షిక వడ్డీ సుమారు 12 శాతం నుంచి మొదలవుతుంది. లోన్ టెన్యూర్ 6 నెలల నుంచి 60 నెలల వరకు పెట్టుకోవచ్చు.

మనీ వ్యూ

మనీ వ్యూ యాప్‌లో కూడా ఈజీగా లోన్ లభిస్తుంది. ఇందులో మీ ఎలిజిబిలిటీని బట్టి రూ. 10 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందొచ్చు.  3 నుంచి 60 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వార్షిక వడ్డీ 14 శాతం నుంచి మొదలవుతుంది.

స్టాష్‌ఫిన్

చిన్న లోన్స్ కోసం స్టాష్‌ఫిన్ అనే యాప్ లో ట్రై చేయొచ్చు. ఇందులో రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అలాగే 30 రోజుల్లో చెల్లిస్తే వడ్డీ కూడా ఉండదు. ఒకవేళ నాలుగేళ్లకు ఈఎంఐ పెట్టుకుంటే 11.99 శాతం వార్షిక వడ్డీ ఉంటుంది.

ఇది ముఖ్యం

లోన్ యాప్ ఆర్ బీఐ అప్రూవ్డ్ అయినా.. వడ్డీ రేట్లు ఇంకా అదనపు ఛార్జీల గురించి పూర్తిగా తెలుసకోవడం చాలా ముఖ్యం. అందుకే లోన్ యాప్స్ లో లోన్ తీసుకునే ముందు టర్మ్ అండ్ కండిషన్స్, మిగతా లోన్ డాక్యుమెంట్స్ అన్నీ క్షుణ్ణంగా చదివాకే నిర్ణయం తీసుకోవాలి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..