Telugu News Business Need to transfer your car to other states, These documents are required, Car Transfer details in telugu
Car Transfer: మీ కారును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలా? ఈ పత్రాలు కావాల్సిందే..!
కారు బదిలీ చేయాలంటే బదిలీ చేస్తున్న రాష్ట్రానికి జీవిత కాలపు పన్నును చెల్లించాలి. అంతకు ముందు కారు ఉన్న రాష్ట్రంలో మనం కట్టిన పన్ను రీఫండ్ కోసం దరఖాస్తున్నారు. అనంతరం కొత్త రోడ్డు పన్ను రసీదుతో పాటు కొత్త రాష్ట్రానికి జీవిత కాల ట్యాక్స్‌ను కడితే మీ కారు బదిలీ అవుతుంది. అయితే కార్ల బదిలీ కోసం చాలా మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. ఈ నేపథ్యంలో వారి అవసరం లేకుండా సింపుల్‌గా కారు బదిలీ కోసం ఎలాంటి పత్రాలో అవసరం. వాటిని ఎలా పొందాలి?
భారతదేశంలో చాలా మందికి సొంత కారు ఉండడం సాధారణ విషయంగా మారింది. ముఖ్యంగా పెరిగిన సౌకర్యాల నేపథ్యంలో సొంత కారు అనేది స్టేటస్ సింబల్‌లా మారింది. అందువల్ల ఉద్యోగస్తులు ఎక్కువగా సొంత కారును కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యినప్పుడు కారు బదిలీ చేయించుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది. కారు బదిలీ చేయాలంటే బదిలీ చేస్తున్న రాష్ట్రానికి జీవిత కాలపు పన్నును చెల్లించాలి. అంతకు ముందు కారు ఉన్న రాష్ట్రంలో మనం కట్టిన పన్ను రీఫండ్ కోసం దరఖాస్తున్నారు. అనంతరం కొత్త రోడ్డు పన్ను రసీదుతో పాటు కొత్త రాష్ట్రానికి జీవిత కాల ట్యాక్స్‌ను కడితే మీ కారు బదిలీ అవుతుంది. అయితే కార్ల బదిలీ కోసం చాలా మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. ఈ నేపథ్యంలో వారి అవసరం లేకుండా సింపుల్‌గా కారు బదిలీ కోసం ఎలాంటి పత్రాలో అవసరం. వాటిని ఎలా పొందాలి? ఎలా కారును రాష్ట్రాల మధ్య బదిలీ చేయాలనే అంశాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఎన్ఓసీ
మీ కారుకు ఎలాంటి జరిమానాలు పెండింగ్ లేవని రుజువు చేస్తూ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే ఎన్ఓసీ
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంక్షిప్తంగా ఎన్‌సీఆర్‌బీ నుంచి వచ్చిన నివేదిక. ఇది కారు దొంగిలించబడలేదు లేదా ఏదైనా ప్రమాదానికి గురికాలేదని స్పష్టం చేస్తుంది. అయితే ఈ పత్రం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఇది అవసరం.
ఎన్ఓసీకు కావాల్సిన పత్రాలు
ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్‌కి దరఖాస్తు
వాహనానికి సంబంధించిన బీమా పత్రాల కాపీ, నియంత్రణ ప్రమాణపత్రం కింద పొల్యూషన్ సర్టిఫికెట్, ఆర్‌సీ కాపీ కావాలి.
డ్రైవింగ్ లైసెన్స్ కాపీ
యజమాని చిరునామా రుజువు. ఇది మీ రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ కావచ్చు.
ప్రాథమికంగా ఏదైనా రకమైన వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం
రుణం ఇంకా పెండింగ్‌లో ఉంటే మీ బ్యాంక్ నుండి క్లియరెన్స్ లెటర్.
ధ్రువీకరణ ప్రక్రియ కోసం మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లను తీసుకువెళ్లడం మంచిది.
ఎన్‌సీఆర్‌బీ, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ రెండింటి నుంచి ఎన్‌ఓసిని పొందడం చాలా సారూప్యంగా ఉంటుంది.
దరఖాస్తు ఇలా
మీరు అవసరమైన ఎన్ఓసీ లను పొందిన తర్వాత ఫారం 28- ఇది గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తును సంబంధిత ఆర్‌టీఓ వద్ద ఫైల్ చేయాలి.
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీతో పాటు రహదారి పన్ను చెల్లింపునకు ఆధారాలు (వాణిజ్య వాహనాలకు మాత్రమే), చెల్లుబాటు అయ్యే బీమా పత్రాలు, ట్రాఫిక్ పోలీసుల ఎన్ఓసీతో దరఖాస్తు చేయాలి.
ఈ పత్రాలన్నింటినీ సేకరించిన తర్వాత మీరు ఆర్‌టీఓకు సమర్పించి, వర్తించే రుసుములను చెల్లించాలి. ఒకసారి పూర్తి చేస్తే ఎన్ఓసీ రావడానికి కొన్ని రోజులు పడుతుంది. మీరు ఎన్ఓసీ పొందిన వెంటనే మీరు మీ కారును కొత్త రాష్ట్రంలో మళ్లీ నమోదు చేయమని అభ్యర్థించవచ్చు.
బదిలీ తర్వాత నమోదు ఇలా
మీ వాహన నమోదు కోసం స్థానిక ఆర్‌టీఓను సంప్రదిందాలి.
రాష్ట్రం నుంచి అసలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన ఫారమ్ నంబర్ 20
మునుపటి ఆర్‌టీఓ ఇచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కేటాయించడానికి అవసరమైన ఫారమ్ నంబర్ 27
చిరునామా మార్పును తెలియజేయడానికి ఉపయోగించే ఫారమ్ నంబర్ 33
పీయూసీ సర్టిఫికేట్ ధ్రువీకరణ పత్రంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
మీ వాహనం ఇప్పటికీ లోన్‌పై ఉన్నట్లయితే బ్యాంక్ ఎన్ఓసీ పత్రం
ఆయా పత్రాలతో మీరు ఆర్‌టీఓ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకుంటే మీ కారు సింపుల్‌గా కొత్త రాష్ట్రానికి బదిలీ అవుతుంది.