ITR: గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేసిన 5.89 కోట్ల మంది.. చివరి రోజు 46.11 లక్షలకు పైగా దాఖలు..

|

Jan 01, 2022 | 8:06 PM

డిసెంబర్ 31 గడువు వరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి (మార్చి 2021తో ముగిసిన) దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు.. కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో దాఖలు అయ్యాయని IT శాఖ శనివారం తెలిపింది...

ITR: గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేసిన 5.89 కోట్ల మంది.. చివరి రోజు 46.11 లక్షలకు పైగా దాఖలు..
It
Follow us on

డిసెంబర్ 31 గడువు వరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి (మార్చి 2021తో ముగిసిన) దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు.. కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో దాఖలు అయ్యాయని IT శాఖ శనివారం తెలిపింది. ఇందులో 46.11 లక్షలకు పైగా ఐటీఆర్‌లు చివరి తేదీ అయిన డిసెంబర్ 31న ఫైల్ చేశారు.” డిసెంబర్ 31, 2021 నాటికి ఆదాయపు పన్ను శాఖ కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITRలు) దాఖలయ్యాయి.

ITR-V ఫారమ్‌ను సమర్పించకపోయినా లేదా పెండింగ్‌లో ఉన్న AY 2020-21 కోసం ఇ-ఫైల్ చేసిన ITRల వెరిఫికేషన్ కోసం సడలింపును ఇస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకటించింది. CBDT AY 2020 కోసం ఇ-ఫైల్డ్ ITRల ధృవీకరణ చేసుకోవడానికి 28 ఫిబ్రవరి 2022 వరకు పొడిగించింది.

2020-21 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన అన్ని ITRలకు సంబంధించి, చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం అనుమతించిన సమయంలో కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఆన్‎లైన్‎లో అప్‌లోడ్ చేశారు. కానీ ITR-V ఫారమ్‌ పెండింగ్‌లో ఉండిపోయింది. బోర్డ్ చట్టంలోని సెక్షన్ 119(2)(a) కింద సంతకం చేసిన పత్రాలను పంపడం ద్వారా రాబడిని ధృవీకరించడానికి అవకాశం ఉంటుంది. ITR-V కాపీని CPC బెంగళూరుకు స్పీడ్ పోస్ట్ ద్వారా 28.02.202 నాటికి పంపించాలని CBDT సర్క్యులర్ పేర్కొంది.

Read Also.. Elon Musk: మస్క్ నోట శ్రీమంతుడు సినిమా మాట.. ఎంత తీసుకున్నామో అంతకంటే ఎక్కువ ఇవ్వాలటా..