Tamarind Seeds in Online Sale:అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, ఆడపిల్ల .. కాదేది కవితకనర్హం అన్నాడు శ్రీ శ్రీ.. అదే విధంగా నేటి వ్యాపారస్తులు వ్యాపారం చేయడానికి.. డబ్బులను సంపాదించడానికి ఏ వస్తువులైనా ఒకే అంటున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ వ్యాపారం అందుబాటులోకి వచ్చిన తర్వాత వస్త్రాలు, వస్తువులు దగ్గరనుంచి పల్లెల్లో ఫ్రీగా దొరికే మామిడాకులు, భోగిపిడకలు, వేపపుల్లలు అన్నీ వ్యాపార వస్తువులుగా మారిపోయాయి. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే.. ఇంటి వద్దకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చింత గింజలను కూడా ఆన్‌లైన్‌లో కూడా అమ్మకానికి పెట్టేశారు. ఎందుకు పనికిరావని పడేసే ఆ చింతగింజలు ఇప్పుడు సిరులు కురిపిస్తున్నాయి. చింతగింజలతో లక్షలను ఆర్జిస్తున్నారు. పైగా ఈ చింత గింజల్లో రకాల బట్టి ధరను కూడా నిర్ణయించారు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలకైనా అమెజాన్, ప్లిప్ కార్ట్ , బిగ్ బాస్కెట్ ఇలా అనేక సంస్థలు చింత గింజలను ఆన్ లైన్ లోకి పెట్టాయి. దీనికి కారణం చింత గింజల్లో దాగున్న ఔషధగుణాలతో పాటు.. వివిధ ప్రయోజనాలు అని తెలుస్తోంది.
నిజానికి చింత చెట్టు ‘భారతదేశపు ఖర్జూరం’ గా ఖ్యాతిగాంచింది. ఈ చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి. చింత పండుని ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఈ చింతపండును తీసే సమయంలో చింత గింజలు వస్తాయి. అయితే ఆ చింత గింజలను పడేసేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది వాటిని నిల్వచేసి.. మార్కెట్ లో వ్యాపారులకు అమ్ముతారు. ఇప్పుడు చాలామంది చింత గింజ పొడిని విదేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. ఇక చింతగింజలు అనేక రోగాల చింతలనుంచి విముక్తి కలిగిస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్య ఔషధం. చింత గింజల్లో ఉండే ఔషధ పదార్థాలు ఎముకలకు బలాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్లలో అరిగిపోయిన గుజ్జును మళ్లీ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. ఈ చింతగింజల పొడి కేవలం కీళ్ల నొప్పులే కాదు డయేరియా, చర్మంపై దురదలు, దంత సంబంధ సమస్యలు, అజీర్ణంవంటి అనేక రోగాలను నయం చేస్తుంది. దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్లు, డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులకు చక్కని ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇక ఎముకలు వీరిని ప్రదేశంపై రోజూ చింతగింజల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే దాంతో ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఇక చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు. చింత గింజలపై పొట్టు తీసి యంత్రాల ద్వారా మెత్తటి పొడిగా తయారు చేస్తారు. దానిని బిస్కెట్ వంటి వాటిల్లో, ఇతర ఆహార పదార్థాలలో వాడుతారు. చింతగింజలను ఎక్కువగా జిగురు తయారు చేయడానికి దీనిని వాడుతారు. గతంలో సినిమా పోష్టర్లు అంటించ డానికి ఈ పిండితో చేసిన జిగురునే ఎక్కువ వాడేవారు.
సో సిరులను కలిపిస్తున్న చింత గింజలు వలన ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆదాయానికి ఆదాయం.. కనుక ఇక నుంచి చింతగింజలను ఎప్పుడూ పడెయ్యకుండా ఆదయ మార్గాలుగా మార్చుకోండి.
Also Read: Salman Khan: 33ఏళ్ల సినీ కెరీర్‌లో 100కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోగా సల్మాన్ రికార్డ్.. మొదటి పారితోషకం ఎంతో తెలుసా..