Petrol Diesel prices today: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా 12 రోజులపాటు పెరిగిన పెట్రో ధరలు తాజాగా బుధవారం కూడా పెరిగాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 38పైసల మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రెండురోజుల పాటు స్థిరంగా కొనసాగిన పెట్రోధరలు.. ఈ రోజు మళ్లీ పెరగడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35పైసలు పెంచడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.90.93 కి చేరగా.. డీజిల్ ధర రూ.81.32గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.97.34కి చేరగా.. డీజిల్ ధర రూ.88.44 కిచేరింది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.93.98 ఉండగా.. డీజిల్ రూ.86.21కి పెరిగింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36పైసలు, డీజిల్‌పై 38పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.54, డీజిల్ ధర రూ.88.69కి చేరింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 35 పైసలు మేర పెరిగింది. దీందో అక్కడ పెట్రోల్ ధర 97.18 గా ఉండగా.. డీజిల్ ధర 90.34కి చేరింది.
ఇదిలాఉంటే.. ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల జేబులు కొల్లగొట్టడంలో మోదీ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాగా గత 54రోజుల్లో చమురు ధరలు 25 సార్లు పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.50 మేర పెరిగాయి.