NPS: మీ భార్య పేరుపై ఈ ఖాతా తెరవండి.. నెలకి రూ.45 వేల వరకు పించన్ పొందండి!

|

Feb 18, 2023 | 7:39 PM

మీరు ఉన్నా.. లేకున్నా.. మీ భార్య ఎవరిపైనా ఆధారపడకుండా.. సొంతంగా డబ్బును పొందాలని కోరుకుంటే..

NPS: మీ భార్య పేరుపై ఈ ఖాతా తెరవండి.. నెలకి రూ.45 వేల వరకు పించన్ పొందండి!
Pension Scheme After Retire
Follow us on

మీరు ఉన్నా.. లేకున్నా.. మీ భార్య ఎవరిపైనా ఆధారపడకుండా.. సొంతంగా డబ్బును పొందాలని కోరుకుంటే.. దీని కోసం మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. మీరు మీ భార్య పేరు మీద ఎన్‌పీఎస్ స్కీంలో ఖాతాను తెరవవచ్చు. NPS ఖాతా మీ భార్యకు 60 ఏళ్లు నిండిన తర్వాత ఏకమొత్తంలో డబ్బును అందజేస్తుంది. దీనితో పాటు, వారికి ప్రతి నెలా పెన్షన్ రూపంలో ఆదాయాన్ని అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, NPS ఖాతాతో మీరు మీ భార్యకు ప్రతి నెల ఎంత పెన్షన్ పొందాలో కూడా నిర్ణయించవచ్చు. దీంతో మీ భార్య 60 ఏళ్ల తర్వాత డబ్బు కోసం ఎవరిపైనా ఆధారపడే అవసరం ఉండదు. మరి ఈ ఎన్‌పీఎస్ పధకం గురించి వివరాలు తెలుసుకుందామా.?

మీరు NPS ఖాతాలో మీ సౌలభ్యం ప్రకారం ప్రతి నెలా డబ్బును జమ చేయవచ్చు. కేవలం రూ.1,000తో మీ భార్య పేరు మీద ఎన్‌పీఎస్‌ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. NPS ఖాతా 60 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఉదాహరణకు.. మీ భార్యకు 30 ఏళ్లు ఉన్నప్పుడు.. ఆమె NPS ఖాతాలో ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి చేయడం మొదలుపెడితే.. దానికి ఏటా 10 శాతం రాబడి వస్తే 60 ఏళ్ల వయసులో ఆమె ఖాతాలో మొత్తం రూ.1.12 కోట్ల వరకు జమ అవుతాయి. ఇందులో దాదాపు 45 లక్షల రూపాయలు ఆమెకు అందుతాయి. ఇది కాకుండా ప్రతి నెలా దాదాపు రూ.45,000 వరకు పించన్ లభిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వారు జీవితాంతం ఈ పెన్షన్ పొందుతూనే ఉంటారు.

ఉదాహరణ:

Source: npstrust

 

కాగా, NPS అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం. ఇందులో పెట్టుబడి పూర్తిగా సురక్షితం. కానీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టే డబ్బుపై రాబడికి హామీ లేదు. ఫైనాన్షియల్ ప్లానర్ల ప్రకారం.. ఎన్‌పిఎస్ ప్రారంభమైనప్పటి నుంచి సగటున 10 నుంచి 11 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. అలాగే మీరు ఏదైనా పధకం లేదా పోస్టల్ స్కీంలో డబ్బును ఇన్వెస్ట్ చేసే ముందు బిజినెస్ నిపుణులను సంప్రదించండి. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని.. ఆ తర్వాతే మీ డబ్బును ఇన్వెస్ట్ చేయండి. పైన పేర్కొన్న సమాచారం కేవలం పలు బిజినెస్ నిపుణుల అంచనాల మేరకు ఇచ్చినది మాత్రమే.