National Pension Scheme: ఎన్‌పీఎస్‌లో పెరుగుతున్న చందాదారుల సంఖ్య.. 2022 నాటికి 52 మిలియన్లకు చేరిక..

| Edited By: Ravi Kiran

Apr 25, 2022 | 9:55 AM

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS )లో చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో కస్టమర్ల సంఖ్యతో పాటు నిర్వహణలో ఉన్న ఆస్తులు కూడా వేగంగా పెరిగినట్లు తెలుస్తోంది..

National Pension Scheme: ఎన్‌పీఎస్‌లో పెరుగుతున్న చందాదారుల సంఖ్య.. 2022 నాటికి 52 మిలియన్లకు చేరిక..
Nps (1)
Follow us on

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS )లో చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో కస్టమర్ల సంఖ్యతో పాటు నిర్వహణలో ఉన్న ఆస్తులు కూడా వేగంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం అత్యధిక సంఖ్యలో అటల్ పెన్షన్ యోజన (APY) చందాదారులతో 2017-18, 2021-22 సంవత్సరాల మధ్య NPS సబ్‌స్క్రైబర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. అదే సమయంలో ఎన్‌పిఎస్ పథకాల్లో గరిష్ట వృద్ధితో నిర్వహణలో ఉన్న ఆస్తులు కూడా నాలుగు రెట్లు పెరిగాయి. వివిధ NPS పథకాలలో వార్షిక రాబడి రేటు 9.0-12.7 శాతం మధ్య ఉంటుందని, APY 9.4 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. NPS 2004 సంవత్సరంలో ప్రారంభించారు. కాగా APY 2015లో ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశంలో పెన్షన్ రంగం గణనీయంగా విస్తరించింది. మొత్తం చందాదారుల సంఖ్య మార్చి 2017లో 15 మిలియన్ల నుంచి మార్చి 2022 నాటికి 52 మిలియన్లకు పెరిగింది.

అత్యధిక సంఖ్యలో APY సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. APY చందాదారుల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు 93 లక్షల నుండి 4.05 కోట్లకు పెరిగింది. పెన్షన్ చందాదారులలో 78 శాతం కంటే ఎక్కువ మంది APY ఖాతాదారులు ఉన్నారు. నిర్వహణలో ఉన్న ఆస్తులలో పెన్షన్ ఆస్తుల వాటా గత ఐదేళ్లలో రూ.1,75,000 కోట్ల నుంచి రూ.7,37,000 కోట్లకు నాలుగు రెట్లు పెరిగింది. ఈ ఆస్తులు చాలా వరకు ఎన్‌పిఎస్ కింద రూ. 1,70,000 కోట్ల నుంచి రూ. 7,11,000 కోట్ల మధ్య ఉన్నాయి. ఇది మొత్తం ఆస్తులలో 96 శాతంగా ఉన్నాయి. భారతదేశపు పెన్షన్ రంగం వృద్ధాప్యంలో ఆదాయ భద్రతను కల్పిస్తుందనిపెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) సభ్యుడు దీపక్ మొహంతి అన్నారు. ఎన్‌పిఎస్‌లో స్వయం ఉపాధి పొందే వ్యక్తులు చేరుతున్నారని చెప్పారు.దేశంలో పెన్షన్ రంగానికి ఇది నాంది అని పేర్కొన్నారు.

Read Also.. Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారా..? కార్డును తెలివిగా ఉపయోగించడానికి చిట్కాలు..!