Infosys Narayana Murthy: 4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత.. ఆ బుల్లి బిలియనీర్ ఎవరో తెలుసా?

|

Mar 19, 2024 | 10:02 AM

దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడు. ఇన్ఫోసిస్‌కు చెందిన 15 లక్షల షేర్లను బహుమతిగా ప్రధానం చేశాడు. వీటి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 240 కోట్లుగా ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 77 ఏళ్ల ఇన్ఫోసిస్‌లో తనకుగల వాటాలో 0.04 శాతం షేర్లను శుక్రవారం ఆఫ్ మార్కెట్ లావాదేవీలో తన మనవడి పేరిట..

Infosys Narayana Murthy: 4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత.. ఆ బుల్లి బిలియనీర్ ఎవరో తెలుసా?
Infosys Narayana Murthy
Follow us on

న్యూఢిల్లీ, మార్చి 19: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడు. ఇన్ఫోసిస్‌కు చెందిన 15 లక్షల షేర్లను బహుమతిగా ప్రధానం చేశాడు. వీటి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 240 కోట్లుగా ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 77 ఏళ్ల ఇన్ఫోసిస్‌లో తనకుగల వాటాలో 0.04 శాతం షేర్లను శుక్రవారం ఆఫ్ మార్కెట్ లావాదేవీలో తన మనవడి పేరిట బదిలీ చేశాడు. షేర్ ట్రాన్ఫర్‌ తర్వాత ఇన్ఫోసిస్‌లో నారాయణ మూర్తి హోల్డింగ్ 0.40 నుంచి 0.36 శాతానికి పడిపోయింది. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో వీటి ఒక్కొక్క షేర్‌ విలువ రూ. 1,602.30 వద్ద ముగిశాయి. దీంతో ఏకాగ్రహ్‌ మూర్తి ఇన్ఫోసిస్‌లో రూ. 240,34,50,000 సంపదన కలిగిన బుల్లి బిలియనీర్‌గా అవతరించాడు.

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్‌ల సంతానం ఏకాగ్రా. గత ఏడాది నవంబర్ 10న బెంగళూరులో వీరు ఏకాగ్రహ్‌కు జన్మనిచ్చారు. గత వారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన నారాయణ మూర్తి, భార్య సుధా మూర్తిలకు ఏకాగ్రహ్‌ మూడో మనవడు. నారాయణ మూర్తి కుమార్తె అక్షత, అల్లుడు రిషి సునాక్‌ (బ్రిటన్‌ ప్రధాని) దంపతులకి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి 1.05 శాతం, సుధా మూర్తి 0.93 శాతం, రోహన్ 1.64 శాతం వాటా కలిగి ఉన్నారు. కాగా నారాయణ మూర్తి మరో ఆరుగురు భాగస్వాములతో కలిసి 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. వీరిలో అశోక్ అరోరా 1989లో ఇన్ఫోసిస్‌ను వదిలి అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం మిగతా సహ వ్యవస్థాపకులందరూ బిలియనీర్లుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.