Falguni Nayar: నైకా నాయిక సంపదలో తిరుగులేదిక.. సుసంపన్న మహిళగా ఫల్గుణి నాయర్

ఇటీవల కాలంలో పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా స్త్రీలు కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఫల్గుణి నాయర్ బ్యూటీ ఇ-కామర్స్ చైన్ నైకాను స్థాపించి స్వీయ-నిర్మిత వ్యాపారవేత్తగా నిలిచింది. ఆమె నికర విలువ 3.1 బిలియన్ డాలర్లు (సుమారు 25 వేల కోట్లు)తో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచారు. నాయర్ 2012లో నైకా బ్రాండ్‌ని ప్రారంభించడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ముందుకు వచ్చారు.

Falguni Nayar: నైకా నాయిక సంపదలో తిరుగులేదిక.. సుసంపన్న మహిళగా ఫల్గుణి నాయర్
Nykaa
Follow us

|

Updated on: Jun 05, 2024 | 2:38 PM

సాధారణంగా వ్యాపారం అంటే చాలా చోట్ల పురుషాధిక్యం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా స్త్రీలు కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఫల్గుణి నాయర్ బ్యూటీ ఇ-కామర్స్ చైన్ నైకాను స్థాపించి స్వీయ-నిర్మిత వ్యాపారవేత్తగా నిలిచింది. ఆమె నికర విలువ 3.1 బిలియన్ డాలర్లు (సుమారు 25 వేల కోట్లు)తో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచారు. నాయర్ 2012లో నైకా బ్రాండ్‌ని ప్రారంభించడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ ఈ-ప్లాట్‌ఫారమ్ భారతదేశంలోని 124 స్టోర్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో వేలాది బ్రాండ్‌లను విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో నైకాను స్థాపించి ఆదర్శంగా నిలిచిన ఫల్గుణి నాయర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

నైకా బ్రాండ్‌కు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టీపీజీ గ్రోత్ కంపెనీ, అలాగే బిలియనీర్లు హర్ష్ మారివాలా, హ్యారీ బంగా తదితరులు మద్దతు ఇస్తున్నారు. నాయర్ భర్త, సంజయ్ నాయర్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌కు కంపెనీలకు సంబంధించిన భారతదేశ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అలాగే కూతురు, కొడుకు కూడా బ్యూటీ బ్రాండ్ కోసం కష్టించి పనిచేస్తున్నారు. ఆమె ఈవై ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2019 – స్టార్ట్-అప్ బై ఎర్నెస్ట్ & యంగ్, ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్, 2019లో బిజినెస్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. నాయర్ సిడెన్‌హామ్ కళాశాల నుంచి బీకామ్ పూర్తి చేసి, అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ చేశారు. తర్వాత ఆమె కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరారు. బ్యాంకింగ్ ఉద్యోగం నుంచి బ్యూటీ బ్రాండ్‌ను నడిపించడం అంత తేలికైన ప్రయాణం కాదని గ్రహించి ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం వైపు తిరిగారు. ఈ నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రస్తుతం ఆమె ఆసియా పవర్ బిజినెస్ వుమెన్‌లలో ఒకరిగా ఉన్నారు. వోగ్ ఇండియా కూడా ఆమెను బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, 2019గా నామినేట్ చేసింది.

ముంబైలోని గుజరాతీ కుటుంబంలో ఫిబ్రవరి 19, 1963న జన్మించిన ఫల్గుణి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టడం పట్ల చాలా భయపడ్డానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలేసి సొంతంగా కంపెనీ పెట్టాలని తన కొడుకుకు చెప్పినప్పుడు అతను కూడా కాస్త షాక్ అయ్యాడని చెప్పింది. కానీ కుటుంబ సభ్యులను కన్వీన్స్ చేసి వారి మద్దతుతో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. నివేదికల ప్రకారం ఫల్గుణి నాయర్‌కు మల్టీ-బ్రాండ్ బ్యూటీ ప్రొడక్ట్ స్టోర్‌ని సందర్శించినప్పుడు ఈ ప్రత్యేక వ్యాపార విభాగంలోకి ప్రవేశించాలనే ఆలోచన వచ్చింది. బ్యూటీ ప్రొడెక్ట్స్‌కు సంబంధించిన సాధనాలకు ప్రతిదాన్ని కనుగొనే ఒక్క దుకాణం లేదని ఫల్గుణి భావించి భావించి నైకాకు రూపకల్పన చేసింది. పని చేస్తే వ్యక్తిగత జీవితం దెబ్బతింటుందనే ఆలోచన నుంచి మహిళలు బయటపడాలని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒక మహిళ దృఢ సంకల్పంతో ఏదైనా సాధించాలని కోరుకుంటే దానిని తన లక్ష్యంగా చేసుకుంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని సాధిస్తుందని ఫల్గుణి చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స