Muthoot Finance: ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ కన్నుమూత.. మెట్లపై నుంచి జారి పడటంతో ఘటన..!

Muthoot Passed Away: ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస వదిలారు. మెట్లపై నుంచి జారి పడటమే ఇందుకు..

Muthoot Finance: ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ కన్నుమూత.. మెట్లపై నుంచి జారి పడటంతో ఘటన..!
muthoot finance

Updated on: Mar 06, 2021 | 11:05 AM

Muthoot Group Chairman Passed Away: ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస వదిలారు. మెట్లపై నుంచి జారి పడటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ముత్తూట్ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన వ్యాపారవేత్త. ప్రస్తుతం ఆయన ముత్తూట్ గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన పూర్తి పేరు మత్తయ్య జార్జ్ జార్జ్ ముత్తూట్. ఆయన సారథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ దేశంలోనే గోల్డ్ లోన్ ఇచ్చే అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందింది.

ఈయనకు భార్య సారా జార్జ్‌, ఇద్దరు కుమారులు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌‌ జార్జ్‌ ఎం.జార్జ్‌, గ్రూప్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ జార్జ్‌ ఉన్నారు. ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌గా ఆయన కుటుంబంలో మూడో తరానికి చెందిన వారు జార్జ్‌. 1979లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన 1993లో గ్రూప్‌ ఛైర్మన్‌గా మారారు.

దేశంలోనే అతి పెద్ద బంగారు ఆభరణాల తనఖా రుణాల కంపెనీ ఎంజీ జార్ట్ ముత్తూట్‌ ఫైనాన్స్‌కు 5,000 బ్రాంచీలు  ఉన్నాయి. ఇంకా 20కి పైగా వ్యాపారాలకు మరో 550 శాఖలున్నాయి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ కమిటీలో సభ్యుడిగా, ఫిక్కీ కేరళ రాష్ట్ర కౌన్సిల్‌ ఛైర్మన్‌గానూ జార్జ్‌ ముత్తూట్‌ వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్‌ ఆసియా మ్యాగజైన్‌ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం, 2011లో ఈయన భారత్‌లో 50వ స్థానంలో ఉన్నారు. 2020కి ర్యాంకింగ్‌ మెరుగుపరచుకుని 500 కోట్ల డాలర్ల సంపదతో 44వ స్థానానికి చేరారు.

తన కుటుంబ వ్యాపారంలో జార్జ్ చిన్న వయస్సులోనే అడుగిడారు. అనతికాలంలో 1979లో ముత్తూట్ ఎండీగా ఎన్నికయ్యారు. 1993 నుంచి ముత్తూట్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇతని హయాంలో కంపెనీ 51 వేల కోట్ల మార్కెట్ సాధించింది. దీంతో కంపెనీ ఆదాయం 8 వుల 722 కోట్లకు చేరింది.

ఇది కూడా చదవండి

AP SEC: వాలంటీర్లతో ఎన్నికల పనులు చేయించొద్దు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ

Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!

Jagan New Gift: ఏపీ విద్యార్థినులకు సీఎం జగన్ బంపర్ గిఫ్ట్.. మహిళా దినోత్సవం రోజునే కొత్త పథకాలు ప్రారంభం