
భారత రైల్వే.. ప్రపంచంలోనే ఇది నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో అతిపెద్ద రవాణా వ్యవస్థ ఇది. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ (Indian Railways) రోజూ కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఇక రైల్వే శాఖ వృద్ధులు, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తోంది. వారి కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంటుంది. తాజాగా సెంట్రల్ రైల్వే జోన్, ముంబైలోని సబర్బన్ రైలు నెట్‌వర్క్‌లో వృద్ధుల కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్ కంపార్ట్‌మెంట్:
ఇక రైలులో ప్రయాణించే వృద్ధులకు స్పెషల్ కాంపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయనుంది. ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లోని ‘ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU)’ రైలులో ఈ సదుపాయం కల్పించనున్నట్లు సెంట్రల్ రైల్వే (CR) తెలిపింది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీ సమయాల్లో వయసు పైబడిన వారికి ప్రయాణాన్ని సౌకర్యంగా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. ఇది విజయవంతం అయితే త్వరలో దశల వారీగా దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: iPhone 16: ఆపిల్ ప్రియులకు బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్.. కేవలం రూ.50 వేలకే ఐఫోన్ 16
ముంబై వైపు నుంచి ఆరో కోచ్‌లోని లగేజ్ వ్యాన్‌ను సీనియర్ సిటిజన్ల విభాగంగా మార్చారు. ఈ కంపార్ట్‌మెంట్‌ను మాతుంగ వర్క్‌షాప్‌లో తయారు చేశారు. వృద్ధులు ఈజీగా రైలు ఎక్కడానికి, దిగడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. కేవలం లక్ష పెట్టుబడితో రూ.1.5 కోట్ల రాబడి
సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు:
ఇదిలా ఉండగా, ఈ కంపార్ట్‌మెంట్‌లో వృద్ధులకు సౌకర్యవంతమైన సీటింగ్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మూడు సీట్ల బెంచీలు, రెండు సీట్ల బెంచీలు ఉన్నాయి. మొత్తం 13 సీట్ల కెపాసిటీతో, రద్దీ టైమ్‌లో వృద్ధులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబులర్ పార్టిషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఐ-లెవల్ ప్యానెల్స్, అలాగే పట్టుకోవడానికి వీలుగా గ్రాబ్ పోల్స్ ఉంటాయి. నిలబడినప్పుడు లేదా కదులుతున్నప్పుడు పట్టుకోవడానికి వీలుగా డోర్ వద్ద ఖర్నాల్ వర్టికల్ గ్రాబ్ పోల్స్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సేఫ్టీని పెంచడానికి డోర్ ఫ్రేమ్స్ కింద ఎమర్జెన్సీ నిచ్చెనలు కూడా అమర్చారు.
ఇది కూడా చదవండి: Gold Price: మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం