Multibagger stocks: ఈ ఏడాది మల్టీ రిటర్న్స్ ఇచ్చిన ఆ స్టాక్స్.. అవి ఏమిటంటే..

|

Dec 28, 2021 | 8:34 PM

కోవిడ్-19 మహమ్మారి జాతీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాది గరిష్ఠ స్థాయికి ఎగబాకింది.

Multibagger stocks: ఈ ఏడాది మల్టీ రిటర్న్స్ ఇచ్చిన ఆ స్టాక్స్.. అవి ఏమిటంటే..
Multibagger Stocks
Follow us on

కోవిడ్-19 మహమ్మారి జాతీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాది గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. 2021లో చాలా స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో కొన్ని టాటా కంపెనీ షేర్లు కూడా ఉన్నాయి. 2021లో NSEలోని మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో 2021లో దాని వాటాదారులకు 2000 శాతం వరకు రాబడిని అందించిన 5 టాటా షేర్లు ఏమిటంటే..

టాటా పవర్:

2021లో ఈ స్టాక్ రూ.75 నుంచి రూ.215కు పెరిగింది. మల్టీబ్యాగర్ స్టాక్ ఈ నెల 18వ తేదీన ఈ ఏడాది ముగింపు గరిష్ఠ స్థాయి రూ.257.30కి చేరిన తర్వాత లాభాల బుకింగ్ ఒత్తిడిలో ఉంది.

టాటా మోటార్స్:

ఈ టాటా గ్రూప్ కంపెనీల షేర్ ఈ ఏడాదిలో రూ. 185 నుంచి రూ. 465 వరకు పెరిగింది. 2021లో దాని వాటాదారులకు దాదాపు 150 శాతం రాబడిని అందించింది. ఈ స్టాక్ ఈ ఏడాది నవంబరు 17న గరిష్ఠంగా రూ.530.15 లకు చేరింది.

Tata Elxsi:

బెంగళూరుకు చెందిన ఈ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్టాక్ 2021లో దాదాపు రూ.1870 నుండి రూ. 5460 లకు పెరిగింది. దాదాపు 190 శాతం పెరిగింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 17 నవంబర్ 2021న గరిష్ఠంగా రూ.6595.10 చేరుకుంది.

నెల్కో:

ఈ టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ రూ.200 నుంచి రూ.720కి పెరిగింది. 2021లో దాదాపు 260 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్:

మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లలో ఇది ఒకటి. దాని వాటాదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. సంవత్సరానికి సంబంధించి, Tata Teleservices షేరు ధర ఒక్కో షేరు స్థాయికి రూ.7.8 నుంచి రూ.169.85కి పెరిగింది. 2021లో 2000 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదు చేసింది.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read Also..  Mutual Funds: మీరు మ్యూచువల్ ఫండ్‎లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..