Multibagger Stock: రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 27 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్..

|

May 20, 2022 | 12:32 PM

ఈ కంపెనీ షేర్లు అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. ఈ షేర్లు పెట్టుబడిదారులకు 200,000% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. కంపెనీ షేర్లు 75 పైసల నుంచి రూ.2,000కు పైగా పెరిగాయి.

Multibagger Stock: రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 27 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్..
Stock Market
Follow us on

కెమికల్ కంపెనీ షేర్లు బంపర్ రిటర్న్స్ ఇచ్చాయి. ఈ కంపెనీ షేర్లు ప్రజలకు 200,000 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించి ఆశ్చర్యపరిచాయి. వినతి ఆర్గానిక్స్ కంపెనీ షేర్లు 75 పైసల నుంచి రూ.2,000కు పైగా పెరిగాయి. కంపెనీ షేర్లలో కేవలం 1 లక్ష రూపాయలు పెట్టిన వ్యక్తులు కోటీశ్వరులుగా మారారు. వినతి ఆర్గానిక్స్ షేర్లు 52 వారాల గరిష్టం రూ.2,289.55గా నిలిచింది. 7 నవంబర్ 2003న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో 75 పైసల స్థాయిలో ఉన్నాయి. 19 మే 2022న BSEలో కంపెనీ షేర్లు రూ. 2046.10 స్థాయిలో ముగిశాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 200,000 శాతానికి పైగా రాబడిని అందించాయి. ఒక వ్యక్తి 2003 నవంబర్ 7న కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి, తన పెట్టుబడిని అలాగే ఉంచుకుని ఉంటే, ప్రస్తుతం ఈ డబ్బు రూ.27.28 కోట్లుగా ఉండేది.

రూ.50 నుంచి రూ.2,000 దాటిన షేర్లు..

గత 9 ఏళ్లలోపే ఈ కంపెనీ షేర్లు అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. వినతి ఆర్గానిక్స్ షేర్లు రూ.50 నుంచి రూ.2,000 దాటాయి. కంపెనీ షేర్లు 6 సెప్టెంబర్ 2013న రూ.44.58 స్థాయిలో ఉన్నాయి. మే 19, 2022న కంపెనీ షేర్లు రూ.2,046.10 వద్ద ముగిశాయి. ఒక వ్యక్తి సెప్టెంబర్ 6, 2013న కంపెనీ షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి తన పెట్టుబడిని అలాగే ఉంచుకున్నట్లయితే, ప్రస్తుతం ఈ డబ్బు రూ.45.89 లక్షలుగా ఉండేది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కథనంలో అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలకు లోబడి ఉంటుంది. దయచేసి పెట్టుబడి పెట్టే ముందు మీ సలహాదారుని సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: SRMIST record: క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో మెరిసిన ఎస్‌ఆర్‌ఎమ్‌ స్టూడెంట్‌.. రూ.కోటి వేతనంతో అమెజాన్‌ జాబ్‌ ఆఫర్‌!

Cash Withdrawal: గూగుల్‌ పే, పేటీఎంతో ఏటీఎమ్‌ నుంచి మనీ విత్‌ డ్రా.. పూర్తి ప్రాసెస్‌ తెలుసుకోండి..!