స్టాక్ మార్కెట్ అంటేనే వైకుంఠపాళీ లాంటిది. ఎప్పుడు ఎవరికి నిచ్చెన తగులుతుందో.. ఎవరు పాము చేతుల్లో చిక్కుతారో చెప్పలేం. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేవారు కూడా ఈకోవలోకి వస్తారు. కొందరికి అదృష్టం చాలా తక్కువ సమయంలోనే దక్కితే.. మరికొందరికి అదృష్టం వరించేందుకు ఏళ్లు పడుతుంది. ఇక కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్.. అనతికాలంలోనే భారీగా రిటర్న్స్ ఇస్తుంటాయి. ఆ కోవకు చెందిన స్టాక్ వేదాంత లిమిటెడ్. ముంబైకి చెందిన ఈ మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ.. తమ షేర్ హోల్డర్స్ ప్రతీ సంవత్సరం డివిడెండ్ ఇస్తూ వస్తోంది. అదీ కూడా మిగిలిన స్టాక్స్ కంటే.. భారీగా ఇస్తుంది.
ఇది చదవండి: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ కనిపెట్టగలరా..
అటు ఈ కంపెనీ షేర్లు కొన్నవారికి దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. ఏడాది కాలంలో ఈ స్టాక్ 100 శాతానికి పైగా రిటర్న్స్, అలాగే ఐదేళ్లకు 217 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చింది. అంటే రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టినవారికి.. ఏడాదిలో రూ. 20 లక్షలు మాత్రమే కాదు.. ఎక్స్‌ట్రాగా డివిడెండ్ మరో రూ. 1.15 లక్షలు వచ్చినట్టు. ఒకవేళ మీరు ఈ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రతీ సంవత్సరం డివిడెండ్ రూపం(8.85%)లో రూ. 12 వేల వరకు రాబడి పొందొచ్చు.
ఇది చదవండి: సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే
52 వారాల కనిష్ఠ ధర రూ. 211.20 నుంచి ఈ స్టాక్.. 52 వారాల గరిష్ట ధర రూ. 523.65 వద్దకు చేరుకుంది. ప్రస్తుతం ఐదు రోజుల నుంచి 4.15 శాతం నెగటివ్‌లో ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్.. ఒక నెలలో 5.89 శాతం, 6 నెలల కాలంలో 22.61 శాతం గ్రోత్ చూపిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ 1.87 లక్షల కోట్లగా ఉంది. ఈ కంపెనీ షేరు స్టాక్ మార్కెట్‌లో లిస్టు అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 13,661 శాతం మేర పెరిగి ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. ఓసారి మీరూ లుక్కేయండి.
ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.! ఓటీటీలో బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..