స్టాక్ మార్కెట్(Stock Market)లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడున్న వ్యవహారం. అయితే కచ్చితమైన సమాచారంతో పెట్టుబడి పెడితే లాభాలు ఆర్జించొచ్చు. ముఖ్యంగా మల్టీ బ్యాగర్(Multibagger) స్టాక్‌లో పెట్టుబడి పెడితే రాబడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి స్టాక్‌ల్లో అరబిందో ఫార్మా లిమిటెడ్ ఒకటి. అరబిందో ఫార్మా లిమిటెడ్ ( AUROPARMA). ఫిబ్రవరి 13, 2022న స్టాక్ రూ. 691.40 వద్ద ఉంది. దీనిని రూ. ఇది ఫిబ్రవరి 13, 2009లో ఈ షేరు ధర రూ. 14.989గా ఉంది. 13 సంవత్సరాల కాలంలో 4615.49 శాతం రాబడిని ఇచ్చింది.
అరబిందో ఫార్మా లిమిటెడ్ జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను (APIలు) తయారు చేస్తుంది. దీని ఉత్పత్తులలో యాంటీబయాటిక్స్, యాంటీ-రెట్రోవైరల్స్, యాంటీ-అలెర్జిక్స్, గ్యాస్ట్రోఎంటరోలాజికల్స్, కార్డియోవాస్కులర్, సెంట్రల్ నాడీ వ్యవస్థ ఉత్పత్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని HITEC సిటీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీని ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 125 కంటే ఎక్కువ దేశాలలో ఉపయోగిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వంటి సంస్థలు అరబిందో ఫార్మా లిమిటెడ్ మార్కెటింగ్ భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ ROE 27.5 శాతం, ROCE 18.5 శాతం బుక్ వాల్యూ రూ.400గా ఉంది.
Note: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.