Multibagger Stock: ఈ నెల 25న జరిగిన వారి సమావేశంలో మల్టీ బ్యాగర్ స్టాక్ డ్యూకాన్ ఇన్‌ఫ్రాటెక్నాలజీస్(Ducon Infratechnologies) తమ పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను(Bonus shares) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఈక్విటీ షేర్ హోల్డర్లకు 1:10 నిష్పత్తిలో కొత్త షేర్లను కేటాయింటాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల షేర్ క్యాపిటల్ పెరగనున్నందున దానికి అవసరమైన ఎంవోఏ నిబంధనలను మార్పు చేసింది. కంపెనీలో ఇప్పటికే వాటాలు కలిగి ఉన్న షేర్ హోల్డర్లకు దీని వల్ల అదనంగా కొత్త షేర్లు రానున్నాయి. పెట్టుబడిదారు కలిగి ఉన్న ప్రతి 10 ఈక్విటీ షేర్లకు గాను.. రూ. 1 విలువ కలిగిన ఒక షేరును బోనస్ రూపంలో అందించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దీనికి సంబంధించి షేర్ హోల్డర్ల నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమోదాన్ని స్వీకరిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వారెంట్ హోల్డర్లకు సైతం ఇదే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఏడాది వ్యవధిలో 260 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది. కేవలం చివరి ఆరు నెలల్లోనే 104% పెరిగింది. బెంచ్‌మార్క్ BSE సెన్సెక్స్‌లో 5% కంటే ఎక్కువ పతనంతో పోల్చితే 2022లో డ్యూకాన్ ఇన్‌ఫ్రా షేర్లు దాదాపు 9% పెరిగాయి. డ్యూకాన్ ఇన్‌ఫ్రాటెక్నాలజీస్ కంపెనీ శిలాజ గ్యాస్ వెలికితీసే వ్యాపారాలకు సేవలు అందించే నైపుణ్యం కలిగిన సంస్థ. వాటికి అవసరమైన సాంకేతికత, మౌలిక సదుపాయాలు, పంపిణీ వ్యవస్థల నిర్వహణలో కంపెనీ తన సేవలను అందిస్తోంది. వీటికి తోడు అల్యూమినా కోసం టెక్నిక్‌లను డీల్ చేసే బల్క్ మెటీరియల్స్, మెళుకువలతో వ్యవహరించే ఫ్లై యాష్, విద్యుదీకరణ సేవలను అందిస్తుంది.
ఇవీ చదవండి..
NITI Aayog: వాటిపై జీఎస్టీ పన్ను రేటు పెంచే పనిలో నీతి ఆయోగ్.. కారణం అదేనా..