Isha Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) గ్రూప్ యాజమాన్యంలో తన వారసులకు బాధ్యతలను అప్పగించేందుకు భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇందు కోసం బిలియనీర్ ముకేష్ అంబానీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి టెలికం విభాగంలో రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించగా, తాజాగా కుమార్తె ఇషాకు కూడా మరో బాధ్యతలు అప్పగించనున్నారు. రిలయన్స్ రిటైల్ యూనిట్‌కు ఇషాను చైర్ పర్సన్‌గా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఆసియాలోనే అత్యంత సంపన్న అంబానీ కుటుంబం వారసత్వ బాధ్యతలు అప్పగించే విషయంలో ముందుడుగు వేసినట్లు తెలుస్తోంది. దీంతో రిలయన్స్ రీటైల్ వ్యాపార పగ్గాలు కుమార్తె ఇషాకు ఇప్పగించనున్నట్లు పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రంలోపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, ముకేష్, నీతా అంబానీ దంపతులకు ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా ట్విన్స్ కాగా, చిన్న కుమారుడు ఆనంత్. ఇషా యేల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఇక బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ముకేష్ దాదాపు 91 బిలియన్ల డాలర్ల నికర సంపదతో ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి