Mukesh Ambani Resigns: రిలయన్స్‌ జియో సంచలన నిర్ణయం.. డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా.. కొత్త చైర్మన్‌గా..

|

Jun 28, 2022 | 6:20 PM

Reliance Jio: చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ జియో బోర్డు చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ స్థానంలో రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్‌గా ఆకాష్ అంబానీ నియమితులయ్యారు.

Mukesh Ambani Resigns: రిలయన్స్‌ జియో సంచలన నిర్ణయం.. డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా.. కొత్త చైర్మన్‌గా..
Akash Ambani
Follow us on

Reliance Jio New Chairman Akash Ambani: దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన రిలయన్స్ గ్రూప్‌లోకి మరో తరం వచ్చింది. జియో టెలికాం డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ జియో కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ (SEBI)కి ఇచ్చిన సమాచారంలో రిలయన్స్ జియో బోర్డు సమావేశం 27 జూన్ 2022న జరిగినట్లు తెలిపింది. ఇందులో రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఆకాష్ అంబానీ నియామకానికి బోర్డు సభ్యుడు ఆమోదం తెలిపారు. జూన్ 27 నుంచి కంపెనీ డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ జియో బోర్డు చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ స్థానంలో రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్‌గా ఆకాష్ అంబానీ నియమితులయ్యారు.

తదుపరి తరానికి బదిలీ..

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ సమాచారాన్ని అందించింది. జూన్ 27న మార్కెట్‌ను మూసివేసిన తర్వాతే ముఖేష్ అంబానీ రాజీనామా చెల్లుబాటవుతుందని కంపెనీ పేర్కొంది. ఆకాష్ అంబానీని బోర్డు ఛైర్మన్‌గా చేయడం గురించి కూడా కంపెనీ తెలియజేసింది. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆకాష్‌ అంబానీని చైర్మన్‌గా నియమించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

వీరికి కూడా బోర్డులో చోటు దక్కింది

దీంతో పాటు అదనపు డైరెక్టర్లుగా రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరి నియామకానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. వీరిద్దరూ 05 సంవత్సరాల పాటు స్వతంత్ర డైరెక్టర్లుగా నియమితులయ్యారు. అదేవిధంగా రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియామకానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నియామకం జూన్ 27, 2022 నుంచి వచ్చే 05 సంవత్సరాలకు కూడా వర్తిస్తుంది. ఈ నియామకాలు ఇంకా వాటాదారులచే ఆమోదించబడలేదు.

బిజినెస్ వార్తల కోసం