Upcoming Cars: జూన్ నెలలో మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..

|

May 30, 2023 | 3:41 PM

జూన్‌లో కొత్త కార్లు మళ్లీ మార్కెట్లోకి రానున్నాయి. కొత్త కారు కొనాలనుకొనే వారికి బెస్ట్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి రానున్న బెస్ట్ మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Upcoming Cars: జూన్ నెలలో మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..
Maruti Suzuki Jimny
Follow us on

ఆటో రంగం ఎప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. ప్రతి నెలా కొత్త ఉత్పత్తులు మార్కెట్లో లాంచ్‌ అవుతూనే ఉంటాయి. వినియోగదారులు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లున్న వాటి కోసమే ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కార్లు కొనాలనుకొంటున్న వారు ఏ కంపెనీ ఏ మోడల్ కొత్తగా తీసుకొచ్చింది.. వాటి బడ్జెట్ ఎంత? దానిలో ఏమేమి ఫీచర్లున్నాయి వంటి అంశాలను పరిశీలిస్తారు. వాటిలో బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ కలిగినవి కావాలనుకొంటున్నారు. 2023 మే మాసం ముగుస్తోంది. జూన్‌లో కొత్త కార్లు మళ్లీ మార్కెట్లోకి రానున్నాయి. కొత్త కారు కొనాలనుకొనే వారికి బెస్ట్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి రానున్న బెస్ట్ మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ..

భారతీయ ఆటో మార్కెట్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మారుతీ సుజుకీ నుంచి మోస్ట్ యాంటిసిపేటెడ్ 5డోర్ కారు లాంచింగ్ కు రెడీ అయ్యింది. ఇండియన్ బ్రాండ్ మారుతి సుజుకి, జూన్ మొదటి వారంలో జిమ్నీ 5-డోర్ 4X4 ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఈ ఆఫ్ రోడర్ డిజైన్, ఆకట్టుకునే పనితీరుతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తోంది. పొడిగించిన వీల్‌బేస్ ఐకానిక్ జిమ్నీ అట్రాక్షన్‌ను కంటిన్యూ చేస్తోంది. పెరిగిన ఇంటీరియర్ స్పేస్‌, అడ్వాన్స్‌డ్ సేఫ్లీ ఫీచర్లు, బ్రాండ్ రిలయబిలిటీ వంటివన్నీ ఈ అప్‌కమింగ్ ఎస్‌యూవీపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఆఫ్-రోడ్ రైడర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. దీని ధర రూ.12.7 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ ఎస్ఎల్55 రోడ్‌స్టర్..

ప్రపంచ ప్రఖ్యాత లగ్జీర కార్ల బ్రాండ్ ఇండియన్ మార్కెట్ పై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా తమ ఉత్పత్తులను ఇక్కడ ఎక్కువగా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా తన కొత్త కారు మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ ఎస్ఎల్55 రోడ్‌స్టర్ ను 2023 జూన్ 22న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. మెర్సిడెస్ బెంజ్ చాలా సంవత్సరాల తర్వాత ఎస్ఎల్ రోడ్‌స్టర్‌ను ఇండియన్ కస్టమర్లకు పరిచయం చేస్తోంది. కంపెనీ ఈ కన్వర్టబుల్ స్పోర్ట్స్ కారు ఏఎంజీ వెర్షన్‌ను ప్రత్యేకంగా భారత్‌కు తీసుకువస్తోంది. మెర్సిడెస్ బెంజ్ వచ్చే నెలలో పరిచయం చేయనున్న ఏఎంజీ ఎస్ఎల్ 55 రోడ్‌స్టర్ కన్వర్టబుల్ స్పోర్ట్స్‌కార్.. ఏఎంజీ హౌస్ లెజెండరీ ఇంజిన్‌తో వస్తుంది. ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన ఏఎంజీ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రానున్న ఈ వెహికల్.. రైడర్లకు క్లాసీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్..

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ అతి తక్కువ కాలంలోనే ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీ జూన్ నెలలో సీ3 ఎయిర్ క్రాస్ వెహికల్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఇది భారత్‌లో రిలీజ్ కానున్న నాలుగో సిట్రోయెన్‌ వెహికల్. ఈ సంస్థ ఇప్పటికే సీ5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్, సీ3, ఈ-సీ3 మోడళ్లను భారత కస్టమర్లకు పరిచయం చేయగా, లేటెస్ట్ మోడల్ సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..