Car Insurance: మీకు కారు ఉంటే వర్షాకాలంలో ఆ ఇబ్బందులు తప్పవంతే.. ఈ చిన్న టిప్స్‌తో ఆ సమస్యలన్నీ దూరం

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో వర్షాకాలం మొదలవుబోతుంది. పెరుగుతున్న ఎండ వేడిమి నుంచి రక్షణకు ప్రజలు నైరుతీ రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వర్షాకాలంలో మొదలు కాక ముందే మనం నిత్యం వాడే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్లు, బైక్‌ల విషయంలో వర్షాకాలం ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనుకోని ఇబ్బందులు తలెత్తవని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో కార్ల నిర్వహణ విషయంతో తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలుసుకుందాం.

Car Insurance: మీకు కారు ఉంటే వర్షాకాలంలో ఆ ఇబ్బందులు తప్పవంతే.. ఈ చిన్న టిప్స్‌తో ఆ సమస్యలన్నీ దూరం
Car Insurance

Updated on: Jun 03, 2025 | 4:00 PM

వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా బురద, వరదలు, నీటి ఎద్దడి వంటి సవాళ్లతో అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలకు కారు ఉంటే వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వర్షం చాలా మందికి ఉపశమనం కలిగించినా కార్ల యజమానులకు మాత్రం కాళరాత్రిగా ఉంటుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ ఇబ్బందులు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా వరదలు కారు ఇంజిన్లను తీవ్రంగా దెబ్బతీస్తాయి. భారీ వర్షాలు, తుఫాను వాతావరణం వల్ల చెట్లు పార్క్ చేసిన కార్లపై పడిన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు కారు బీమా ఉంటే ఉండవు. బీమా పాలసీల్లో చాలా వరకు  వరదల వల్ల, వర్షాల వల్ల కలిగే నష్టాలను కవర్ చేయవు. కాబట్టి బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని యాడ్-ఆన్లకు సభ్యత్వాన్ని పొందాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కారు బీమా తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం. 

జీరో డిప్రిసియేషన్

ఈ యాడ్ ఆన్ కారుకు సంబంధించిన భాగాల పై తరుగుదల కోసం ఎలాంటి తగ్గింపులు లేకుండా కారు యజమాని పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని పొందేలా చేస్తుంది. వర్షాకాలంలో నీటి ఎద్దడి లేదా వరదలు కీలకమైన ప్రాంతాలలో బాడీ ప్యానెల్లు లేదా ఇతర భాగాలకు నష్టం సాధారణంగా ఉన్నప్పుడు ఇది సహాయపడుతుంది.

ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్

ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ అనేది ఒక ముఖ్యమైన యాడ్-ఆన్. కారు ఇంజిన్‌లోకి నీరు ప్రవేశించడం, ఆయిల్ లీకేజ్ లేదా ఇతర వర్షాకాల సంబంధిత సమస్యల కారణంగా ఇంజిన్ దెబ్బతింటే దానిని రిపేర్ చేయడానికి లేదా మార్చడానికి అయ్యే ఖర్చును ఈ యాడ్-ఆన్ కవర్ చేస్తుంది. ఇంజిన్ రిపేర్ చేయడం లేదా మార్చడం చాలా ఖరీదైనది కావచ్చు. దాని కోసం కవర్ కలిగి ఉండటం వాహన యజమానికి మనశ్శాంతిని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

రోడ్ సైడ్ అసిస్టెన్స్

ఇది చాలా మంది కార్ల యజమానులు ఎంచుకునే మరొక సాధారణ యాడ్-ఆన్. వాహనాల బ్రేక్డౌన్లు కార్ల యజమానులకు ఒక పీడకల, కానీ వర్షాకాలంలో, ముఖ్యంగా నీరు నిలిచిపోవడం, వరదలు సంభవించే ప్రాంతాలలో ఇవి సర్వసాధారణం. రోడ్ సైడ్ అసిస్టెన్స్ లేదా ఆఎస్‌ఏకు సబ్ స్కైబ్ చేసుకోవడం వల్ల బ్రేక్ డౌన్ల విషయంలో సహాయం లభిస్తుంది, టోయింగ్, చిన్న మరమ్మతులు, ఇంధన డెలివరీ, అవసరమైతే వసతి కూడా ఉంటుంది. ఇది వర్షాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

యూసేజ్ ప్రొడెక్ట్ కవర్

ఈ యాడ్-ఆన్ ఇంజిన్ ఆయిల్, నట్స్, బోల్ట్స్ వంటి వినియోగ వస్తువుల ఖర్చుకు కవరేజీని అందిస్తుంది. వర్షాకాలం సంబంధిత నష్టం కారణంగా వీటిని మార్చాల్సి రావచ్చు. సమగ్ర కవరేజ్ లో యాడ్- ఆన్ సబ్ స్కైబ్ చేయకపోతే ఈ ఖర్చులను బీమా సంస్థలు కవర్ చేయవు.

టైర్ ప్రొటెక్టర్

ఈ యాడ్-ఆన్ ప్రత్యేకంగా టైర్లకు జరిగే నష్టాన్ని కవర్ చేస్తుంది. వర్షాకాలంలో గుంతల రోడ్డు పరిస్థితులు, వరదలు మొదలైన వాటి కారణంగా ఇవి తరచుగా టైరు పంక్ఛర్ పడడం, త్వరగా అరిగిపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ నేపథ్యంలో టైర్ ప్రొటెక్టర్ యాడ్ ఆన్ తీసుకుంటే టైరు మార్చినప్పుడు బీమా వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి