Indian Railways: రైల్వేశాఖ సంచలన నిర్ణయం.. టికెట్ బుకింగ్‌కు కొత్త రూల్స్.. ఇక నుంచి టికెట్ బుక్ చేసుకోవాలంటే..

భారతీయ రైళ్లే మరో కీలక నిర్ణయం తీసుకుంది. 300 రైళ్లల్లో టికెట్ బుకింగ్‌కు ఓటీపీ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టింది. త్వరలో అన్ని రైళ్లకు ఇది విస్తరించనున్నారు. దీంతో ఇక నుంచి రైళ్లలో టికెట్ బుక్ చేసుకోవాలంటే మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుది.

Indian Railways: రైల్వేశాఖ సంచలన నిర్ణయం.. టికెట్ బుకింగ్‌కు కొత్త రూల్స్.. ఇక నుంచి టికెట్ బుక్ చేసుకోవాలంటే..
Indian Railways

Updated on: Jan 16, 2026 | 3:08 PM

ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఉపయోగపడేలా రైల్వే టికెట్ల బుకింగ్స్‌లో కొత్త మార్పులు తీసుకొస్తుంది. రైల్వే టికెట్లలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకోకుండా సామాన్య ప్రజలకు టికెట్లు దొరికేలా నియమ నిబంధనలు మార్చింది. కొంతమంది ఏజెంట్లు రైల్వే టికెట్లు ఓపెన్ అవ్వగానే వెంటనే బుక్ చేస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రజలకు టికెట్లు దొరకడం లేదు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే టికెట్లు బుకింగ్స్‌కు ఆధార్ ఓటీపీని రైల్వేశాఖ తప్పనిసరి చేసింది. దళారులను అరికట్టేందుకు, టికెట్ల బుకింగ్‌లొ పారదర్శత తెచ్చేందుకు ఈ రూల్ కొత్తగా ప్రవేశపెట్టింది.

300 రైళ్లల్లో లాంచ్

ప్రస్తుతానికి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 300 రైళ్లల్లో టికెట్ బుకింగ్‌కు ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి ఈ ఓటీపీ ఆధారిత టికెటింగ్ వ్యవస్ధ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక నుంచి ఓటీపీ ధృవీకరణ లేకుండా ఈ రైళ్లల్లో టికెట్ బుక్ చేసుకోలేరు. బుకింగ్ ప్రక్రియ మరింత సురక్షితంగా,పారదర్శకంగా చేసేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దశలవారీగా అన్ని రైళ్లల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రైల్వే రిజర్వేషన్ టకెట్ కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకోవాలన్నా మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ నెంటర్‌కు వచ్చే ఓటీపీని అందించాల్సి ఉంటుంది. ఈ తర్వాతనే టికెట్లను అందిస్తారు. నకిలీ బుకింగ్‌లు, ఒక వ్యక్తి ఎక్కువ టికెట్లను బుక్ చేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

త్వరలో అన్ని రైళ్లకు విస్తరణ

అనధికార ఏజెంట్ల ప్రమేయాన్ని సమర్థవంతంతగా అరిక్టడమే కాకుండా ప్రయాణికులకు టికెట్ల జారీని మరింత సౌకర్యవంతం, సురక్షతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. మొదటి దశలో 300 రైళ్లల్లో తీసుకురాగా.. ఇందులో వచ్చే స్పందనను బట్టి అన్ని రైళ్లకు విస్తరించనున్నారు. అలాగే ఐఆర్‌సీటీ వెబ్‌సైట్‌లో ఆధార్ ధృవీరణ పూర్తయితేనే టికెట్లు బుక్ చేసుకునేలా కొత్త వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చారు.