ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పు వస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకున్న తర్వాత వ్యాపారం చేద్దాంలే అనుకునే వారు కానీ ప్రస్తుతం చదువు పూర్తికాగానే వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి తోడు ప్రభుత్వాలు పెట్టుబడి కోసం పథకాలు అందిస్తుండడం, ఈకామర్స్ సైట్స్ వ్యాపార విస్తృతి పెరగడంతో తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కొత్త కొత్త వ్యాపారాల కోసం అన్వేషిస్తున్నారు.
ఇక ప్రస్తుతం నెలకొన్ని పోటీ నేపథ్యంలో మార్కెట్లో నకిలీ వస్తువులు ఎక్కువై అయిపోతున్నాయి. దీంతో ప్రజలు ఏది కొనాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. దీనిని అధిగమించి మంచి నాణ్యత గల వస్తువులను మార్కెట్లోకి తీసుకొస్తే నష్టాలనే సమస్యే లేకుండా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. అందులోనూ తక్కువ పెట్టుబడితోనే మంచి ప్రాఫిట్ పొందొచ్చు. అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పటికీ అవసరం ఉండే ఆహార పదార్థాల్లో కారం ప్రధానమైంది. కారం లేనిది ఏ వంట పూర్తికాదని తెలిసిందే. అలాంటి కారం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే లాభాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇందుకోసం ప్రాథమిక స్థాయిలో పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. మంచి ఎండు మిర్చిని కొనుగోలు చేసే బాగా ఎండపెట్టి, మిల్లులో కారం పొడిగా గ్రైండ్ చేయించాలి. అనంతరం వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తే సరిపోతుంది.
లాభాల విషయానికొస్తే తక్కువలో తక్కువ నెలకు రూ. 30 వేలు సంపాదించొచ్చు. ఇక మీకు వస్తున్న లాభాలు, గిరాకీ ఆధారంగా మీరే సొంతంగా గ్రైండ్ మిషన్స్‌ను కొనుగోలు చేసిన ఓ చిన్న పరిశ్రమ మాదిరిగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు లాభాలు ఆర్జించడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కూడా కల్పించవచ్చు. మీ సొంత బ్రాండ్ పేరుతో దుకాణాల్లో విక్రయించవచ్చు. మీరు చేసే మార్కెటింగ్ ఆధారంగా నెలకు రూ. లక్ష వరకు కూడా ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..