ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా అన్ని కంపెనీలు ఈవీ వాహనాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాయంటే వీటి భవిష్యత్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. చాలా రోజుల నుంచి ఎంఐ కంపెనీ ఈవీ కారు గురించి వస్తున్న ఫీలర్స్ అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అయితే తాజాగా ఎంఐ ఈవీ కార్ల కోసం ఈ వారం నుంచి ఆర్డర్‌లు తీసుకుంటుందని సమాచారం అందించింది. ఎంఐ మొదటి ఎలక్ట్రిక్ వాహనం ధర 500,000 యువాన్ల కంటే తక్కువగా ఉంటుందని ఎంఐ సీఈఓ తెలిపారు. ఎంఐ కంపెనీ ఎస్‌యూ7 కారు ధర పరంగా అందరినీ ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కారు గురించి అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ అనంతరం ఆర్డర్ల తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంఐ ఎస్‌యూ 7 కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆటోమేకర్‌లలో ఒకటిగా అవతరించాలని సరికొత్త ఎంఐ ఎస్‌యూ 7 కారున గత డిసెంబర్‌లో ఎంఐ కంపెనీ ఆవిష్కరించింది. టెస్లా కార్లు, పోర్షేకు సంబంధించిన ఈవీ కార్ల కంటే మెరుగైన సాంకేతికతను ఎస్‌యూ7 ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డిసెంటర్ నుంచి ఎంఐ కంపెనీ చైనాలోని ఎంఐ స్టోర్‌లలో ఈ కారును ప్రదర్శించడం ప్రారంభించింది. ముఖ్యంగా ఓషన్ బ్లూ వెర్షన్ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ కారు రెండు వెర్షన్లలో రానుంది. మొదటిది ఒకే ఛార్జ్‌తో 668 కిలోమీటర్ల (415 మైళ్లు) వరకు డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంటుంది. రెండోది 800 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది.
ఎంఐ ఒక దశాబ్దంలో ఈవీ అభివృద్ధి కోసం 10 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొంది. ఎంఐ సంస్థ సంవత్సరానికి 2,00,000 వాహనాల తయారు చేసే వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. బీజింగ్‌లో ఎంఐ ఫ్యాక్టరీలో ప్రభుత్వ-యాజమాన్య వాహన తయారీ సంస్థ బీఏఐసీ గ్రూప్ యూనిట్ ద్వారా కార్లు తయారు చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..