Mercedes Benz: మెర్సెడెజ్‌ బెంజ్‌ కీలక నిర్ణయం.. అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్‌ వాహనాలు

|

Jul 23, 2021 | 10:15 AM

Mercedes Benz: మెర్సెడెజ్ బెంజ్ సంస్థ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు 2022-2030 మధ్య 47 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది..

Mercedes Benz: మెర్సెడెజ్‌ బెంజ్‌ కీలక నిర్ణయం.. అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్‌ వాహనాలు
Mercedes Benz
Follow us on

Mercedes Benz: మెర్సెడెజ్ బెంజ్ సంస్థ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు 2022-2030 మధ్య 47 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. అయితే మెర్సెడెస్‌ బెంజ్‌ సంస్థ 2022 నాటికి అన్ని విభాగాలలో బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే 2025 నాటికి మెర్సెడెజ్‌ బెంజ్‌ మూడు విద్యుత్‌ వాహనాల తయారీ ప్లాంట్లను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అదే విధంగా మెర్సెడెస్‌ ప్రపంచ వ్యాప్తంగా 5,30,000 ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలని చోచిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సంస్థ ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ముందు అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

అయితే ప్రస్తుతం అన్ని వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటం, కాలుష్యం అధికం కావడం తదితర కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక ద్విచక్ర వాహనాల్లో ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. టాటా కంపెనీ కూడా ఎకక్ట్రిక్‌ వాహనాలను సైతం అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి

Tesla in India: టెస్లా కారు వచ్చేస్తోంది..ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్లివచ్చేయొచ్చు .. ధర ఎంతంటే..

అదిరిపోయే ఆఫర్.. రూ. 9 లక్షల కారు కేవలం రూ. 2.70 లక్షలకే.. 18 నెలల తర్వాత నచ్చకుంటే డబ్బు వాపస్!