
Maruti Suzuki: భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థలలో ఒకటైన మారుతి సుజుకి తన కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం, కొత్త ధరలు ఆగస్టు 2026 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మోడల్‌ను బట్టి కార్ల ధరలు గరిష్టంగా రూ. 30,000 వరకు పెరగనున్నట్లు తెలిపారు. జూన్ 2026లోనే కార్ల ధరలు ఇప్పటికే పెంచిన విషయం తెలిసిందే.
ఈ విషయమై విడుదల చేసిన సమాచారం ప్రకారం, ముడి పదార్థాల ధరల పెరుగుదల పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి సుజుకి పేర్కొంది. దేశీయ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో సహా ఉత్పత్తి వ్యయాలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చులను పూర్తిగా భరించలేకపోతున్నామని, అందువల్ల ధరల పెంపు ఒక్కటే పరిష్కారమని నిర్ణయించుకున్నామని అది పేర్కొంది.
మారుతి సుజుకి తన కార్ల మోడళ్ల వారీగా ధరల పెంపును ఇంకా ప్రకటించలేదు. అంటే ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, వాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా వంటి అన్ని ప్రముఖ మోడళ్లలో ఈ ధరల పెంపు ప్రతిబింబించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, ధరల పెంపు వివరాలు మోడళ్ల వారీగా ప్రకటించనుంది కంపెనీ.
ఆగస్టు 2026 నుండి ధరలు పెరగనున్నందున, కారు కొనాలనుకునే వారు వెంటనే బుక్ చేసుకోవడం ద్వారా ధరల పెరుగుదలను నివారించుకునే అవకాశం ఉంది. అయితే, మనం కొనుగోలు చేసే డీలర్ నిబంధనలు, బుకింగ్ తేదీ, కారు డెలివరీకి గల కారణంపై ఇది ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల్లో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్ దెబ్బతింటుందా? కేంద్రం కీలక ప్రకటన!
గతంలో జూన్‌లో మారుతి సుజుకి తన కార్ల ధరలను పెంచినప్పుడు, పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, ఉత్పత్తి వ్యయాలను కారణంగా పేర్కొంది. ఇప్పుడు అదే కారణంతో మళ్లీ ధరల పెంపును ప్రకటించింది. మారుతి సుజుకి మాత్రమే కాకుండా, టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు కూడా పెరిగిన ఉత్పత్తి వ్యయాలను కారణంగా చూపుతూ ధరల పెంపును ప్రకటించాయి. ఇదిలా ఉండగా, మారుతి సుజుకి కారును ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తారు. అందుకే ఈ ధరల పెంపు వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: Credit Card: క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి