Maruti Suzuki: మారుతి సుజుకీ నుంచి మరో అదిరిపోయే కారు.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతో తెలుసా..?

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కార్ల విడుదలవుతున్నాయి. ఇక ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ నుంచి కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. మారుతీ సుజుకీ తమ కొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ను వచ్చే వారం దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది..

Maruti Suzuki: మారుతి సుజుకీ నుంచి మరో అదిరిపోయే కారు.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతో తెలుసా..?
Maruti Suzuki Fronx

Updated on: Apr 12, 2023 | 2:47 PM

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కార్ల విడుదలవుతున్నాయి. ఇక ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ నుంచి కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. మారుతీ సుజుకీ తమ కొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ను వచ్చే వారం దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో-2023లో కంపెనీ తొలిసారిగా ప్రదర్శించింది. ఈ వాహనం ధర రూ.8 నుంచి రూ.14 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉండే అవకాశం ఉంది. మారుతీ హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో ఆధారంగా తీసుకువచ్చిన ఫ్రాంక్స్‌ పొడవు కూడా తక్కువే ఉంటున్నట్లు సమాచారం.

ఫీచర్స్‌..

ప్రీమియం ఆడియో సిస్టమ్‌, 9 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, సన్‌రూఫ్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌, హెడ్స్‌-అఫ్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీల పార్కింగ్‌ కెమెరాల, 6 ఎయిర్‌ బ్యాగ్స్‌, పుష్‌ బటన్‌ తదితర ఫీచర్స్‌ ఈ కారులో ఉన్నట్లు సమాచారం. ఈ ఫీచర్సే కాకుండా మరిన్ని అత్యాధునిక ఫీచర్స్‌ కూడా ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ మోడల్‌లో ఐదు వేరియంట్లు ఉన్నాయి. వివిధ రంగుల్లో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే నిస్సాన్‌ మాగ్నైట్‌, హ్యుందాయ్‌ వెన్యూ, హోండా డబ్ల్యూఆర్‌-వీ, టాటా నెక్సాన్‌, రెనో కైగర్‌, కియా సోనెట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి ఇతర కంపెనీల మోడళ్లతో పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి