Maruti Cars: మారుతీ కార్ల ప్రియులకు షాక్‌.. ధర విషయంలో కంపెనీ కీలక నిర్ణయం..

పెరుగుతున్న ద్రవ్యోల్బణ వాతావరణంతో పాటు పెరిగిన కమోడిటీ రేట్లు కారణంగా వ్యయ ఒత్తిడిని ఉటంకిస్తూ 2024 జనవరిలో వాహనాల ధరలను పెంచనున్నట్లు దేశంలోని మారుతీ సుజుకి ఇండియా ఇటీవల తెలిపింది. ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుంచి మల్టీ-యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు అనేక రకాల వాహనాలను విక్రయిస్తున్న మారుతీ కంపెనీ విక్రయిస్తుంది. ఈ కార్ల ధరలు రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల మధ్య ఉంటాయి.

Maruti Cars: మారుతీ కార్ల ప్రియులకు షాక్‌.. ధర విషయంలో కంపెనీ కీలక నిర్ణయం..
Cars

Edited By: Ram Naramaneni

Updated on: Nov 29, 2023 | 9:45 PM

భారతదేశంలో సొంత కారు ఉండాలనేది సగటు మధ్య తరగతి కుటుంబం కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి పొదుపులను ఉపయోగించడంతో పాటు కారు లోన్లపై ఆధారపడుతూ ఉంటారు. సొంత కారు కొనాలనుకునే వారికి తక్కువ ధరకు కార్లు అంటే టక్కున గుర్తొచ్చేవి మారుతీ కంపెనీ కార్లే. అయితే మారుతీ సుజుకీ కార్ల లవర్లకు షాక్‌ ఇస్తూ కంపెనీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ వాతావరణంతో పాటు పెరిగిన కమోడిటీ రేట్లు కారణంగా వ్యయ ఒత్తిడిని ఉటంకిస్తూ 2024 జనవరిలో వాహనాల ధరలను పెంచనున్నట్లు దేశంలోని మారుతీ సుజుకి ఇండియా ఇటీవల తెలిపింది. ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుంచి మల్టీ-యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు అనేక రకాల వాహనాలను విక్రయిస్తున్న మారుతీ కంపెనీ విక్రయిస్తుంది. ఈ కార్ల ధరలు రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల మధ్య ఉంటాయి. అయితే ఏ మోడల్‌ కార్ల ధరలు పెంచుతుందో? కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో మారుతీ ప్రకటన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

మారుతీ సుజుకి ఇండియా, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ధరల పెంపుపై ఇటీవల ఓ ప్రకటన చేశారు. మాట్లాడుతూ ధరల పెరుగుదల మోడల్ నుంచి మోడల్‌కు మారుతూ ఉంటుందని, కొన్ని కార్లకు ఇది ఎక్కువగా ఉంటుందని వివరించారు. ముఖ్యంగా కమోడిటీలలో అస్థిరతతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉండడం వల్ల జనవరిలో ధరలను పెంచాలని నిర్ణయించుకున్నామని వివరించారు. మారుతీ సుజుకీ ఇండియా  ఈ ఏడాది ఏప్రిల్‌లో చివరిసారిగా ధరలను 0.8 శాతం పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది మొత్తం 2.4 శాతం పెరిగింది. ధరలను పెంచడం తప్ప ఇప్పుడు వేరే మార్గం లేదని పెరుగుదలకు సంబంధించిన చచ్చితమైన పరిమాణాన్ని మేము ఇంకా గుర్తించలేదు.

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మొత్తం ద్రవ్యోల్బణం, పెరిగిన వస్తువుల ధరల కారణంగా పెరిగిన వ్యయ ఒత్తిడి కారణంగా కంపెనీ తన కార్ల ధరలను జనవరి 2024లో పెంచాలని యోచిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా పేర్కొంది. ముఖ్యంగా కంపెనీ ఖర్చును తగ్గించడానికి, పెరుగుదలను ఆఫ్‌సెట్ చేయడానికి గరిష్ట ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అది మార్కెట్‌కు కొంత పెరుగుదలను అందించాల్సి ఉంటుందని వివరించింది. ఈ ధరల పెరుగుదల మోడల్‌లలో మారుతూ ఉంటుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

అన్ని కంపెనీలదీ అదే దారి

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి వచ్చే ఏడాది జనవరి నుంచి భారత్‌లో తమ వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఇన్‌పుట్, నిర్వహణ ఖర్చులు పెరుగిన నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమని పేర్కొంది. ముఖ్యంగా కారు మోడల్‌కు అనుగుణంగా ధర పెంపు ఉంటుందని వివరించింది. బెంజ్‌ ఇండియా జనవరి నుంచి ధరలను పెంచడానికి కూడా ఆలోచిస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..