Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

| Edited By: Team Veegam

Mar 12, 2021 | 6:24 PM

Gold Price Today: బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా, మళ్లీ పసిడి ధర పెరిగింది. గత కొన్ని రోజులు....

Gold Price  Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Follow us on

Gold Price Today: బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా, మళ్లీ పసిడి ధర పెరిగింది. గత కొన్ని రోజులు పెరుగుతున్న బంగారం ధర.. ఇటీవల నుంచి తగ్గుముఖం పట్టింది. కానీ శుక్రవారం మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.350 పెరిగితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.380 పెరిగింది.

దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.43,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,710 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,330 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,970 ఉంది.

ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 ఉంది.

అలాగే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,980 ఉంది.

పుణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,710 ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 ఉంది.

అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 42,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 ఉంది.

కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే.. మరి కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు 55 వేల వరకు మార్క్‌ దాటి పోగా, ప్రస్తుతం మాత్రం 43వేలకు అటు ఇటుగా ఉంటున్నాయి.

ఇది చదవండి: PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..

TVS Apache: టీవీఎస్‌ అపాచీ ఆర్టీఆర్‌ 160 4వీ బైక్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..?

LED TV Price Hike: టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇప్పుడే కొనేయండి.. ఏప్రిల్‌ వరకు ఆగితే అంతే..