ఓడరేవుల్లో భారీగా తగ్గిన కార్గో రవాణా

|

Oct 12, 2020 | 7:29 PM

కొవిడ్ మహమ్మారి దెబ్బకు భారతదేశపు టాప్ 12 పోర్టులు కార్గో ట్రాఫిక్‌ గణనీయంగా క్షీణించింది.

ఓడరేవుల్లో భారీగా తగ్గిన కార్గో రవాణా
Follow us on

కొవిడ్ మహమ్మారి దెబ్బకు భారతదేశపు టాప్ 12 పోర్టులు కార్గో ట్రాఫిక్‌ గణనీయంగా క్షీణించింది. ఓడరేవుల అపెక్స్ బాడీ లెక్కల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 14 శాతం క్షీణించి 298.55 మిలియన్ టన్నులకు తగ్గాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబరు మధ్య కాలంలో 12 ప్రధాన ఓడరేవుల్లో 348.23 మెట్రిక్ టన్నుల లావాదేవీలు నిర్వహించగా, 2020 సెప్టెంబర్‌లో వరుసగా ఆరవ నెల కూడా పెద్దగా రవాణా జరగలేదని తెలిపింది.

షిప్పింగ్ మంత్రి మన్సుఖ్ మాండవియా గత నెలలో 12 ప్రధాన ఓడరేవులలో కార్గో ట్రాఫిక్ గణనీయంగా తగ్గిందని, ఇది కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రతికూల ప్రభావం చూపిందన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 12 ప్రధాన నౌకాశ్రయాలు 298.55 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసినట్లు వెల్లడించారు. ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ ప్రకారం, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2020 వరకు మునుపటి సంవత్సరం కంటే 14.27 శాతం తక్కువగా నమోదైందన్నారు.

కరోనా కారణంగా ఏర్పడిన అంతరాయాల వల్ల మోర్ముగావ్ మినహా అన్ని ఓడరేవులు ప్రతికూల వృద్ధిని సాధించాయి. కమ్రాజర్ పోర్ట్ (ఎన్నోర్) వద్ద కార్గో హ్యాండ్లింగ్ ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 31.63 శాతం పెరిగింది. అయితే, చెన్నై, కొచ్చిన్, జెఎన్‌పిటి వంటి ఓడరేవులు తమ కార్గో వాల్యూమ్‌లను ఈ కాలంలో 20 శాతానికి పైగా తగ్గించాయి. కోల్‌కతా, ముంబై ఓడరేవులు 15 శాతానికి పైగా క్షీణించాయి.

భారతదేశం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో 12 ప్రధాన ఓడరేవులు నిర్వహిస్తున్నారు. దీన్‌దయాల్ (పూర్వ కండ్ల), ముంబై, జెఎన్‌పిటి, మోర్ముగావ్, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, కామరాజర్, విఒ చిదంబర్నర్, విశాఖపట్నం, పారాడిప్, కోల్‌కతాలోని హల్దియాతో సహా కామరాజర్ నౌకాశ్రయం సరుకు నిర్వహణలో 31.63 శాతం క్షీణించి 10.77 మెట్రిక్ టన్నులకు చేరుకోగా, ఐపిఎ గణాంకాల ప్రకారం చెన్నై ఓడరేవు ఏప్రిల్-సెప్టెంబర్‌లో 25.71 శాతం తగ్గి 18.38 మెట్రిక్ టన్నులకు పడిపోయింది.

అటు జెఎన్‌పిటి పోర్టులో కార్గో హ్యాండ్లింగ్ 21.71 శాతం పడిపోయి 26.94 మెట్రిక్ టన్నులకు చేరుకోగా, కోల్‌కతాలో 18.78 శాతం క్షీణించి 25.56 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ముంబై నౌకాశ్రయం 18.74 శాతం క్షీణించి 24.45 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇతర వస్తువులలో కంటైనర్లు, బొగ్గు పెట్రోలియం, చమురు రవాణాలో భారీగా క్షీణత కనిపించింది.