Mobile Recharge: మెుబైల్ యూజర్లకు షాకివ్వనున్న టెలికాం కంపెనీలు.. మరో సారి రేట్ల పెంపుకు సిద్ధం..

|

May 25, 2022 | 6:46 AM

Mobile Recharge: గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని టెలికాం కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎంచుకుంటున్నాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం మోపేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Mobile Recharge: మెుబైల్ యూజర్లకు షాకివ్వనున్న టెలికాం కంపెనీలు.. మరో సారి రేట్ల పెంపుకు సిద్ధం..
Mobile Operators
Follow us on

Mobile Recharge: గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని టెలికాం కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎంచుకుంటున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఆదాయాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు వినియోగదారులపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే గత సంవత్సరం నవంబర్ లో ప్రీ పెయిడ్ ఛార్జీలను పెంచాయి. కానీ పెరుగుతున్న ఖర్చులను భర్తీ చేసుకునేందుకు ఈ సంవత్సరం మరోసారి వడ్డంచేందుకు ఆపరెటర్లు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.

టెలికాం ఆపరేటర్లు ఈ సంవత్సరం దీపావళి నాటికి ఛార్జీలను 10 నుంచి 12 శాతం మేర పెంచేందుకు సిద్ధమౌతున్నాయి. వినియోగదారుని నుంచి వచ్చే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఎయిర్ టెల్ కు రూ.200, జియో రూ.185, వొడఫోన్ ఐడియా రూ.135 కు పెంచుకోవాలని కంపెనీలు చూస్తున్నాయని ఈక్విటీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

గత సంవత్సరం టెలికాం దిగ్గజాలు సగటున 20 నుంచి 25 శాతం వరకు రేట్లను పెంచాయి. దీంతో ఎక్కువ మంది వినియోగించుకునే బేసిక్ ప్లాన్ రేటు రూ.79 నుంచి రూ.99కి చేరింది. ఎయిర్ టెల్ 84 రోజుల వ్యవధితో అందిస్తున్న రూ.698 ప్యాక్ రేటు రూ.839కి చేరింది.