Mahindra Thar: వరద నీటిలో దూసుకుపోతున్న థార్.. వైరల్ అవుతున్న వీడియో..!
మన దేశంలో విడుదలైన అన్ని మోడళ్ల కార్లలోనూ మహీంద్ర థార్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. పెద్దల నుంచి యువత వరకూ దీనికి అభిమానులే. రోడ్డుపై ఈ కారు కనిపించిందంటే చాాలు అక్కడే ఆగి చూసేవాళ్లు ఎందరో ఉంటారు. మహీంద్ర థార్ కారు గురించి పత్రికల్లో, సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా సరే దానికి వేల సంఖ్యలో వ్యూస్ ఉంటాయి. అలాంటి వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెల్లటి రంగులో ఉన్న మహీంద్ర థార్ కారు వరద నీటి వచ్చిన నీటిలో దూసుకుపోతూ కనిపించింది. సుమారు 650 ఎంఎం (0.65 మీటర్లు)లోతు నీటిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించింది.

స్టాక్ థార్ 650 ఎంఎం లోతు నీటిలోనూ నడిచే సామర్థ్యం కలిగి ఉందని మహీంద్ర కంపెనీ వెల్లడించింది. ఇటీవల కాలంలో అకాల వర్షాలు భారీ స్థాయిలో కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. నగరాల్లోని రోడ్లన్నీ ముంపునకు గురవుతున్నాయి. అలా వరద నీరు నిండిన ఓ రోడ్డుపై దూసుకుపోతున్న థార్ ఎస్ యూవీ వీడియో వైరల్ గా మారింది. అయితే నిర్ణీత స్థాయికి మించిన నీటిలో ప్రయాణం చేయకూడదని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా నీటి మట్టం కారు గ్రిల్ ను మించకూడదు. ఎందుకంటే ఇంజిన్ సక్రమంగా పనిచేయాలంటే గాలి అవసరం. గాలిని లోపలకు తీసుకునేందుకు ఎయిర్ ఇన్ టెక్ ఉంటాయి. ఇంజిన్ సక్రమంగా పనిచేయడానికి అవి చాాలా అవసరం.
సాధారణంగా వరద నీటితో నిండిన రోడ్లపై కారు ప్రయాణం చేసినప్పుడు నీరు ఇంజిన్ లోకి ప్రవేశించి ప్రమాదం ఉంది. దీని వల్ల దాని పనితీరుకు ఆటంకం కలుగుతుంది. పిస్టన్ సీజర్ కారణంగా ఇంజిన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ రకమైన స్థితినే హైడ్రో లాక్ అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో వాహనం విద్యుత్ భాగాలు పాడైపోతాయి. మహీంద్ర నుంచి విడుదలైన థార్ లైఫ్ స్లైల్ ఎస్ యూవీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని రకాల రోడ్లపై చక్కగా పరుగులు తీస్తుంది. దీని ధర రూ.13.16 లక్షల నుంచి రూ.17.62 లక్షల ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ లో ఉన్న మారుతీ సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా తదితర మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.
View this post on Instagram
- మహీంద్ర థార్ పెట్రోలు, డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. 2 లీటర్ ఎం స్టేషన్ టర్బో పెట్రోల్ విత్ డైరెక్ట్ ఇంజెక్షన్ (టీజీడీఐ) నుంచి 150 బీహెచ్ పీ పవర్, మాన్యువల్ లో 300 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. ఆటోమెటిక్ టాన్స్ మిషన్ లో 320 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది.
- 1.5 లీటర్ ఎంహాక్ టర్బో డీజిల్, సీఆర్డీఈ 117 బీహెచ్పీ పవర్, 300 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది.
- డీజిల్ ఇంజిన్ 2.2 లీటర్ ఎంహాక్ టర్బో డీజిల్, సీఆర్ డీ ఈ 130 బీహెచ్పీ పవర్, 300 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఎంపికల్లో విడుదలైంది.
- ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తదితర ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







