Mahindra Thar-5: మహీంద్రా థార్‌-5 డోర్‌ ఫొటో లీక్‌.. థార్‌-5 స్టన్నింగ్‌ ఫొటో చూస్తే వావ్‌ అంటారంతే..!

కొన్ని నెలలుగా మహీంద్రా థార్ 5-డోర్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరీక్షిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కారు లాంచ్ సమయంలో ఎలా ఉంటుందో? మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహీంద్ర థార్‌ 5- డోర్‌ వెర్షన్‌ చిత్రాలు ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మహీంద్రా థార్ 5-డోర్ ఎటువంటి మోషన్ బ్లర్ లేకుండా స్పష్టంగా చూడవచ్చు. మహీంద్రాకు సంబంధించిన ఈ తాజా ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Mahindra Thar-5: మహీంద్రా థార్‌-5 డోర్‌ ఫొటో లీక్‌.. థార్‌-5 స్టన్నింగ్‌ ఫొటో చూస్తే వావ్‌ అంటారంతే..!
Mahindra Thar 5 Door

Edited By: Ravi Kiran

Updated on: Oct 13, 2023 | 6:40 AM

మహీంద్రా థార్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌స్టైల్‌ ఎస్‌యూవీల్లో ఒకటి. థార్ 5-డోర్ వెర్షన్ భారతదేశ మార్కెట్లో ఎక్కువగా వెయిటింగ్‌ వాహనంగా ఉంది. కొత్త తరం మహీంద్రా థార్ కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. ముఖ్యంగా కార్‌ లవర్స్‌ చాలా కాలం నుంచి వాహనాలకు సంబంధించిన 5 డోర్ల మోడల్‌ను చూడటానికి వేచి ఉన్నారు. గత కొన్ని నెలలుగా మహీంద్రా థార్ 5-డోర్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరీక్షిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కారు లాంచ్ సమయంలో ఎలా ఉంటుందో? మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహీంద్ర థార్‌ 5- డోర్‌ వెర్షన్‌ చిత్రాలు ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మహీంద్రా థార్ 5-డోర్ ఎటువంటి మోషన్ బ్లర్ లేకుండా స్పష్టంగా చూడవచ్చు. మహీంద్రాకు సంబంధించిన ఈ తాజా ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మహీంద్రా థార్‌ 5-డోర్‌ వెర్షన్‌ సైడ్ యాంగిల్ కూడా దాని పరిమాణం గురించి ఓ మంచి అప్‌డేట్‌ ఇస్తుంది. మహీంద్రా థార్ 5-డోర్ మొత్తం ప్రొఫైల్‌ను గమనిస్తే ఈ కారు మహీంద్రా స్కార్పియో- ఎన్‌లా కనిపిస్తుంది.  కొత్త మహీంద్రా థార్ ఎక్ట్సీరియర్ ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న థార్‌ను పోలి ఉంటుంది. కొత్త వెర్షన్ పొడవైన వీల్‌బేస్‌ను పొందుతుంది అంటే 2వ వరుస ప్రయాణీకులకు ఎక్కువ స్థలం, బూట్ స్పేస్ మొత్తం పెరుగుతుంది. థార్ 5-డోర్ ఎస్‌యూవీ బాక్సీ ఆకారంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ కొత్త అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఈ మహీంద్రా థార్ 5-డోర్ లాంచ్ 2024లో ఉంటుందని మహీంద్రా ఇప్పటికే ధ్రువీకరించింది. 

మహీంద్రా థార్ 5 డోర్ ప్రాక్టికాలిటీ, స్థలం, పరిమాణం కారణంగా థార్ 3-డోర్ కంటే భారతీయ మార్కెట్లో చాలా విజయవంతమైన ఉత్పత్తిగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ కారు మారుతీ సుజుకీ జిమ్నీకు పోటీనిస్తుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ కొత్త థార్ ప్రతి అంశంలో జిమ్నీ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. హుడ్ కింద, మహీంద్రా థార్ 5-డోర్ అదే 2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో శక్తిని పొందుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..