Mahindra Scorpio: ప్రమాదాలను ముందుగానే పసిగట్టేస్తుంది.. ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్స్

Mahindra Scorpio N: స్కార్పియో-ఎన్ ఏడీఏఎస్‌లో స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ లాంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఉంటాయి. మహీంద్రా ఐసీఈ ఎస్‌యూవీల్లో ఇవి లభించడం తొలిసారి. స్పీడ్ లిమిట్ అసిస్ట్ అనేది నిర్దిష్ట రహదారుల్లో వర్తించే..

Mahindra Scorpio: ప్రమాదాలను ముందుగానే పసిగట్టేస్తుంది.. ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్స్

Updated on: Jun 28, 2025 | 5:56 PM

Mahindra Scorpio N: భారతదేశపు దిగ్గజ ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యధికంగా అమ్ముడవుతున్న స్కార్పియో N కొత్త ADAS వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ దీనిని పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.35 లక్షలు. దీనితో పాటు, ఆటోమేకర్ మరిన్ని ఫీచర్లతో కొత్త Z8T వేరియంట్‌ను కూడా జోడించింది కంపెనీ. ఇది Z8L వేరియంట్ కంటే తక్కువగా ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20.29 లక్షలు.

లెవెల్ 2 ఏడీఏఎస్‌తో మరింత మెరుగైన భద్రత, టెక్నాలజీ ప్రమాణాలు ప్రీమియం Z8L వేరియంట్‌లోని లెవెల్ 2 ఏడీఏఎస్ ప్రత్యేకతలు:

➦ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్

➦ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్

➦ స్టాప్ అండ్ గో ఫీచరుతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్

➦ స్మార్ట్ పైలట్ అసిస్ట్

➦ లేన్ డిపార్చర్ హెచ్చరిక

➦ లేన్ కీప్ అసిస్ట్

➦ ట్రాఫిక్ సంకేతాల గుర్తింపు

➦ హై బీమ్ అసిస్ట్

మహీంద్రా స్కార్పియో N Z8L ను మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 7, 6 సీట్ల లేఅవుట్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు, ADAS-స్పెక్ స్కార్పియో N 2WD, 4WD గా కూడా అందుబాటులో ఉంటుంది. టెక్నాలజీ గురించి చెప్పాలంటే, స్కార్పియో N లెవల్ 2 ADAS సూట్‌ను కలిగి ఉంది. ఇందులో 10 లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, స్టాప్ అండ్ గోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ ఉన్నాయి. ఇవి మెరుగైన డ్రైవింగ్ సౌకర్యం, భద్రత కోసం అందుబాటులో ఉన్నాయి.

 


స్కార్పియో-ఎన్ ఏడీఏఎస్‌లో స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ లాంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఉంటాయి. మహీంద్రా ఐసీఈ ఎస్‌యూవీల్లో ఇవి లభించడం తొలిసారి. స్పీడ్ లిమిట్ అసిస్ట్ అనేది నిర్దిష్ట రహదారుల్లో వర్తించే స్పీడ్ లిమిట్స్ ‌విషయంలో డ్రైవర్లను అలర్ట్ చేస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మోడ్ అనేది సునాయాసంగా, సింగిల్ బటన్ ఆపరేషన్ ద్వారా స్పీడ్ లిమిట్స్‌కి అనుగుణంగా వెళ్లే వేగాన్ని నియంత్రించుకునేందుకు వీలవుతుంది. ఫ్రంట్ వెహికల్ స్టార్ అలర్ట్ అనేది, ముందు నిలబడిన వాహనం కదలడం మొదలైనప్పుడు అలర్ట్ చేస్తుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: భారతీయ రైల్వేలలో ఎన్ని రకాల సీట్లు ఉంటాయి? ఎవరికి ఎలాంటి బెర్త్ కేటాయిస్తారు?

దీనితో పాటు కొత్త Z8T వేరియంట్ Z8, Z8L వేరియంట్‌ల మధ్య ఉంది. ఈ కొత్త వేరియంట్ 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 12-స్పీకర్ సోనీ-బ్రాండెడ్ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, సిక్స్-వే పవర్డ్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM వంటి అనేక ఫీచర్స్‌తో వస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి