భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఒక్కో వాహనంపై ఎంత తగ్గింపు అంటే…

దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేసింది. బీఎస్‌6 మోడల్‌ కార్లపై..

  • Sanjay Kasula
  • Publish Date - 4:30 pm, Sun, 17 January 21
భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఒక్కో వాహనంపై ఎంత తగ్గింపు అంటే...

Mahindra & Mahindra : దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేసింది. బీఎస్‌6 మోడల్‌ కార్లపై అత్యధికంగా రూ. 3.06లక్షల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. ఆల్‌న్యూ థార్‌ కాకుండా మిగిలిన వాటిపై ఇది వర్తించనుందిని తెలిపింది. వీటిల్లో క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్‌ఛేంజి బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఇతర ఆఫర్లు కూడా వీటిలోనే కలిసి ఉంటాయని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం జనవరి 31 వరకు మాత్రమే లభిస్తాయని తెలిపింది.

మహీంద్రా ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ ఆల్టురస్‌ జీ4 మోడల్‌పై అత్యధికంగా రూ.2.20లక్షల క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.50 వేలు ఎక్స్‌ఛేంజి బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.16వేలు, ఇతర లబ్ధిలు రూ.20 వేల వరకు లభిస్తాయి. స్కార్పియోపై రూ.39,502 వరకు డిస్కౌంట్లు ఇస్తోంది.

వీటిల్లో రూ.15,000 ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ ఆఫర్‌తోపాటు రూ.10,002 క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.4,500 కార్పొరేట్‌ డిస్కౌంట్‌, అదనపు ఆఫర్ల కింద మరో రూ.10వేలు ఇవ్వనున్నారు. కేయూవీ 100 నెక్స్ట్‌పై రూ.62,055 తగ్గింపు వర్తిస్తుంది. ఎక్స్‌యూవీ 500పై రూ.59వేల లబ్ధిపొందవచ్చు. ది మర్రాజో ఎంపీవీపై రూ.36వేలు, బొలేరోపై రూ.24వేల తగ్గింపులు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి :

Covid Caller Tune : ఇప్పుడు ఆ గొంతు వినిపించడం లేదు.. మరిన్ని సూచనలతో కొత్త ట్యూన్​ వినిపిస్తోంది..

రెగ్యులర్ రైళ్లు తిరిగి ప్రారంభమయ్యేది అప్పుడేనా.? మార్చి నెలాఖరు దాకా ప్రత్యేక ట్రైన్స్ పొడిగింపు.!!