Covid Caller Tune : ఇప్పుడు ఆ గొంతు వినిపించడం లేదు.. మరిన్ని సూచనలతో కొత్త ట్యూన్​ వినిపిస్తోంది..

కరోనా కాలర్ ట్యూన్ మారింది. లాక్ డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు ప్రజలను ప్రభావితం చేసిన కాలర్ ట్యూన్ గుర్తుండి ఉంటుంది. కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉన్నా..

Covid Caller Tune : ఇప్పుడు ఆ గొంతు వినిపించడం లేదు.. మరిన్ని సూచనలతో కొత్త ట్యూన్​ వినిపిస్తోంది..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 4:08 PM

Covid Caller Tune : కరోనా కాలర్ ట్యూన్ మారింది. లాక్ డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు ప్రజలను ప్రభావితం చేసిన కాలర్ ట్యూన్ గుర్తుండి ఉంటుంది. కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉన్నా కరోనా కాలర్ ట్యూన్స్ మాత్రం ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించింది. ఎక్కడ ఎవరు ఎవరికి కాల్ చేసినా కరోనా వైరస్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల సమాచారం వినిపిస్తుంది. ప్రజలు తెలుసుకోవాల్సిన సమాచారంను ఈ కాలర్ టూన్ తో ప్రజలకు చేరింది.

అయితే కరోనా విషయంలో అవగాహన కల్పించడం లేటెస్ట్ గా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ తో కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ప్రచారం సాగించింది. అయితే ఇప్పుడు ఈ కరోనా కాలర్ ట్యూన్ మారిపోయింది. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేలా అమితాబ్ బచ్చన్ టోన్‌తో వచ్చే సూచనల స్థానంలో కొత్త ట్యూన్​ను తీసుకొచ్చింది. కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రధానాంశంగా ఓ మహిళ స్వరంతో ఈ కొత్త ట్యూన్ వినిపిస్తోంది.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేలా ప్రజల్ని చైతన్య పరిచేందుకు రూపొందించిన కాలర్‌ ట్యూన్‌లో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ మార్పులు చేసింది. ఇప్పటి వరకూ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ స్వరంతో వచ్చే ఆ ట్యూన్‌ స్థానంలో ఓ మహిళ గొంతుక వినిపిస్తోంది.

దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభమైన వేళ.. కాలర్‌ ట్యూన్‌లోని విషయం కూడా మారింది. ”కొత్త సంవత్సరం కొవిడ్‌ టీకాల రూపంలో సరికొత్త ఆశాకిరణాలను తీసుకొచ్చింది. భారత్‌లో రూపొందించిన టీకాలు ఎంతో సురక్షితమైనవి. ప్రభావవంతమైనవి. కరోనా వైరస్‌ నుంచి అవి కాపాడగలవు. వ్యాక్సిన్లపై వచ్చే వదంతులను విశ్వసించొద్దు. మీ వంతు వచ్చినప్పుడు కచ్చితంగా టీకా తీసుకోండి.” అని కొత్త కాలర్‌ ట్యూన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాకుండా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటి వరకూ పాటిస్తున్న మాస్క్‌, శానిటైజేషన్‌ తదితర జాగ్రత్తలన్నీ కొనసాగించాలని సూచిస్తోంది.