Mahindra Finance: మహీంద్రా ఫైనాన్స్ (Mahindra Finance) తన కస్టమర్ల కోసం ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది . ఈ పథకం ప్రత్యేకంగా డిజిటల్‌గా యాక్టివ్‌గా ఉండే కస్టమర్ల కోసం. మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ దృష్టి గ్రామీణ, సెమీ-అర్బన్ రంగంపై కేంద్రీకరించబడింది. వెబ్‌సైట్ ద్వారా డిపాజిటర్లకు డిజిటల్ మోడ్‌లో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని (Special Deposit Scheme) కంపెనీ ఆఫర్ చేస్తుంది. నేటి డిజిటల్ ( Digital) ప్రపంచంలో డిపాజిటర్లు డిపాజిట్ తీసుకునే కంపెనీలతో సన్నిహితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పథకం ప్రస్తుతం ఉన్న పథకానికి భిన్నంగా ఉంటుంది. మహీంద్రా ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ (Scheme)కు మంచి రేటింగ్ ఉంది.
0.20 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది
ఈ పథకం కింద కస్టమర్‌లు యేటా 0.20 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారు. దీని కింద వినియోగదారులు 30 నెలల డిపాజిట్‌పై 6.20 శాతం వడ్డీని పొందుతారు. అలాగే 42 నెలల డిపాజిట్‌పై 6.50 శాతం వడ్డీని పొందుతారు. డిజిటలైజేషన్ చొరవ కింద కంపెనీ ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇది కాకుండా, సీనియర్ సిటిజన్లకు అదనంగా 20 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
మహీంద్రా ఫైనాన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వివేక్ కార్వే తెలిపిన వివరాల ప్రకారం.. డిజిటల్ మోడ్ ద్వారా వినియోగదారులకు వివిధ రకాల ఆర్థిక, పెట్టుబడి ఉత్పత్తులను అందించడానికి కంపెనీ ఈ స్కీమ్‌ను ప్రారంభించబడింది. మహీంద్రా ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ CRISIL నుండి FAAA రేటింగ్ పొందింది.
ఆన్‌లైన్ పెట్టుబడి సౌకర్యం అందుబాటులో ఉంటుంది. డిపాజిటర్లకు, ఈ స్కీమ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. పెట్టుబడి కోసం వినియోగదారులు వెబ్‌సైట్‌ని సందర్శించాలి. కస్టమర్లకు అనేక రకాల డిజిటలైజ్డ్, ఆటోమేషన్ సంబంధిత సౌకర్యాలు కూడా లభిస్తాయని కంపెనీ విశ్వసిస్తోంది. అలాగే వినియోగదారులు ఎటువంటి అవాంతరాలు లేకుండా స్కీమ్ సదుపాయం పొందవచ్చని కంపెనీ తెలిపింది.
స్కీమ్ వివరాలు:
ఇవి కూడా చదవండి: