Electric Vehicles: మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలు.. ఎప్పటి వరకు అంటే..

Electric Vehicles: దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా 2027 నాటికి ఎస్‌యూవీ, లైట్‌ కమర్షియల్‌ వెహికల్‌ (LCV) విభాగంలో..

Electric Vehicles: మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలు.. ఎప్పటి వరకు అంటే..

Updated on: Nov 10, 2021 | 9:34 AM

Electric Vehicles: దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా 2027 నాటికి ఎస్‌యూవీ, లైట్‌ కమర్షియల్‌ వెహికల్‌ (LCV) విభాగంలో 16 మోడళ్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సదరు కంపెనీ మంగళవారం వెల్లడించింది. దీని ద్వారా భారతదేశంలోని ఎలక్ట్రిక్‌ మొబిలిటీ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 2025 నాటికి మొత్తం ఆదాయంలో 15 నుంచి 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తన వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారులను తీసుకురావడమో.. లేదా ఎలక్ట్రిక్‌ వ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా మార్చడం వంటిపై దృష్టి సారిస్తోంది.

మహీంద్రా ఇప్పటికే ఎలక్ట్రిక్‌ రంగంలో రూ.3000 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. భారతీయ వాహన తయారీదారు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కోసం కొత్త బ్రాండ్‌ పేరుకు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 2027 నాటికి ఈ కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురానుంది కంపెనీ.

కంపెనీ ఛైర్మన్‌కు పద్మభూషణ్‌ అవార్డు
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాకు పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించారు. ఆనంద్‌ మహీంద్రా వ్యాపారం, పరిశ్రమకు చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. ఆనంద్‌ మహీంద్రా నాయకత్వంలోని మహీంద్రా గ్రూప్‌ దేశీయంగా, అంతర్జాతీయంగా ఆటోమొబైల్‌ నుంచి ఐటీ, ఏరోస్పేస్‌ వరకు అనేక కీలక పారిశ్రామిక రంగాలలో తనకు, దేశానికి ప్రశంసలు తెచ్చిపెట్టిందని, రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నందున ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియా వేదికగా తన సంతషాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

RBI Hackathon: డిజిటల్‌ చెల్లింపులపై ఆర్బీఐ హ్యాకథాన్‌.. రూ.40 లక్షలు గెలుచుకునే అవకాశం..!

Bank Interest Rates: ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. గృహ రుణాలపై స్వల్పంగా వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం..!